వచ్చే నెలలో మారుతి కార్ల ధరలు పైపైకి.. 6 నెలల్లో మూడోసారి
వచ్చే నెలలో మారుతి కార్ల ధరలు పైపైకి.. 6 నెలల్లో మూడోసారి| వచ్చే నెలలో మారుతి కార్ల ధరలు పెరుగనున్నాయి. ఇన్పుట్ వ్యయం పెరిగినందున....

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయాణ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ధరలు పెంచనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
వివిధ రకాల ముడి సరుకు, విడి భాగాలతో సహా ఇన్పుట్ వ్యయం పెరిగిపోవడంతో వాహనాల తయారీపై భారం పడుతున్నదని మారుతి సుజుకి పేర్కొన్నది. ఈ పరిస్థితుల్లో కార్ల కొనుగోలు దారులపై అదనపు భారం మోపక తప్పడం లేదన్నది. అందువల్లే కార్ల ధరలు పెంచుతున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
వివిధ మోడల్ కార్ల ధరల పెరుగుదలలో తేడాలు ఉంటాయని తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండుసార్లు మారుతి సుజుకి కార్ల ధరలు పెంచివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 16న అన్ని మోడల్ కార్ల ధరలు 1.6 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు ఈ ఏడాది జనవరి 18న తొలిసారి ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలు రూ.34 వేలు పెంచుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వ్యాఖ్యానించింది.
మారుతి సుజుకి (ఎంఎస్ఐ) ఎంట్రీ లెవల్ హ్యాబ్బ్యాక్ ఆల్టో నుంచి ఎస్-క్రాస్ మోడల్ కార్లను విక్రయిస్తున్నది. వీటి ధరలు రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షల మధ్య ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

