Maruti Grand Vitara | మారుతి గ్రాండ్ విటారా లక్ష కార్ల సేల్స్.. ఏడాదిలోపే మైలు దాటిందిలా..!
Maruti Grand Vitara | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మిడ్ సైజ్ ఎస్యూవీ ‘గ్రాండ్ విటారా’ ఆవిష్కరించిన ఏడాదిలోపు లక్ష కార్లను విక్రయించిన మైలురాయిని దాటింది.
Maruti Grand Vitara | దేశీయ కార్ల మార్కెట్లో రారాజు మారుతి సుజుకి. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరించడంలో ముందు ఉన్న మారుతి.. ఎస్యూవీ సెగ్మెంట్లో పట్టును కాపాడుకునేందుకు ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ కారు గ్రాండ్ విటారా మరో రికార్డు నమోదు చేసింది. ఆవిష్కరించిన ఏడాదిలో లక్ష యూనిట్లు విక్రయించింది. తాజాగా మరో 22 వేల కార్ల బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఆవిష్కరించిన నాటి నుంచి ప్రతి నెలా 8,333 కార్లు విక్రయిస్తూ వచ్చింది. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న కార్లలో అత్యధికంగా లీటర్ పెట్రోల్‌పై 27.97 కి.మీ మైలేజీనిస్తుంది.
గత నెల కార్ల విక్రయాల్లో గ్రాండ్ విటారా బెస్ట్ మోడల్‌గా నిలిచింది. ఆగస్టు (2023)లో 11,818 యూనిట్లు విక్రయించింది. ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్‌లో సేల్స్ పెరుగుతాయని మారుతి సుజుకి అంచనా వేసింది. ఇప్పటి వరకూ మారుతి సుజుకి మోడల్ కార్ల బుకింగ్స్ 3.50 లక్షలు పెండింగ్‌లో ఉండగా, వాటిలో గ్రాండ్ విటారా వాటా 31 శాతం.
మార్కెట్ లక్ష్యాలను చేరుకునేందుకు గత జనవరిలో కొత్తగా డిజైన్ చేసిన గ్రాండ్ విటారాను ఆవిష్కరించింది. సీఎన్జీ వేరియంట్ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. 12 వేరియంట్లలో గ్రాండ్ విటారా మార్కెట్లో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ సిగ్మా కారు ధర రూ.12.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై.. టాప్ హై ఎండ్ వేరియంట్ ఆల్ఫా+ మోడల్ ధర రూ.23.68 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతోంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్తోపాటు హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్, ఎంజీ అస్టర్ తదితర మోడల్ కార్లకు గట్టిపోటీ ఇస్తోంది.
2022 సెప్టెంబర్ నుంచి సేల్స్ ఇలా
2022 సెప్టెంబర్ – 4769
2022 అక్టోబర్ – 8052
2022 నవంబర్ – 4433
2022 డిసెంబర్ – 6,171
2023 జనవరి – 8,662
2023 ఫిబ్రవరి – 9,183
2023 మార్చి — 10,045
2023 ఏప్రిల్ — 7,742
మే 2023 —- 8,877
జూన్ 2023 — 10,486
జూలై 2023 — 9,079
ఆగస్టు 2023 – 11,818
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

