న్యూఢిల్లీ : మారుతి సుజుకి బాలెనో 2022 ఫేస్‌లిఫ్ట్‌ను ఫిబ్రవరిలో లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. న్యూ బాలెనో ధరను మారుతి సుజుకి మరికొద్ది వారాల్లో వెల్లడించనుంది. న్యూ బాలెనో ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులతో కస్టమర్లను ఆకట్టుకునేలా న్యూ వెహికల్‌ను కంపెనీ సిద్ధం చేసింది.
ఇక మెకానికల్‌గా ప్రస్తుత మోడల్లో ఎలాంటి మార్పులు ఉండవని సమాచారం. ఇక 2022 బాలెనో ఫేస్లిప్ట్లో భారీ గ్రిల్, న్యూ రాప్అరౌండ్ హెడ్‌ల్యాంప్స్, న్యూ ఎల్ఈడీ డీఆర్ఎల్ సిగ్నేచర్స్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్, రియర్ సైడ్ రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్, న్యూ బంపర్, రివైజ్డ్ డిజన్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లను కంపెనీ జోడిస్తోంది.