Mark Zuckerberg | జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్రచికిత్స.. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేసిన మెటా సీఈవో
Mark Zuckerberg | మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (mixed martial arts) పోటీకి సన్నద్ధమవుతున్న ఫేస్బుక్ అధినేత, మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల శిక్షణ సమయంలో గాయాలపాలైన విషయం తెలిసిందే. మెకాలి గాయం (Knee Injury) కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. తాజాగా వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు.
Mark Zuckerberg | మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (mixed martial arts) పోటీకి సన్నద్ధమవుతున్న ఫేస్బుక్ అధినేత, మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల శిక్షణ సమయంలో గాయాలపాలైన విషయం తెలిసిందే. మెకాలి గాయం (Knee Injury) కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. తాజాగా వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని జుకర్‌బర్గ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఎడమ మోకాలి వద్ద ఉండే లిగ్మెంట్కు గాయమైనట్లు తెలిపారు. ఆపరేషన్ విజయవంతమైనట్లు వివరించారు (Undergoes Surgery).
‘మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటుండగా మోకాలికి గాయమైంది. ఇప్పుడే ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. నేను వచ్చే ఏడాది జరగబోయే మ్యాచ్‌కు ట్రెయినింగ్ తీసుకుంటున్నాను. కానీ ఇప్పుడు గాయం కారణంగా అది కాస్త ఆలస్యం అవుతోంది. నేను త్వరగా కోలుకొని మళ్లీ శిక్షణ తీసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read..
Earthquake | ప్రజలు అప్రమత్తంగా, సిద్ధంగా ఉండండి.. నేపాల్ భూకంపం వేళ నిపుణుల హెచ్చరిక
Diwali Gift | ఉద్యోగులకు అదిరిపోయే దివాళి గిఫ్ట్.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఫార్మా సంస్థ యజమాని
Vasundhara Raje | ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోంది.. రాజస్థాన్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

