Scorpio Classic | మార్కెట్లోకి మహీంద్రా న్యూ స్కార్పియో క్లాసిక్..!
Scorpio Classic | దేశీయ మార్కెట్లోకి మహీంద్రా.. సరికొత్త స్కార్పియో క్లాసిక్‌ను ఆవిష్కరించింది. దీని ధర ఈ నెల 20న వెల్లడించనున్నది.
Scorpio Classic | కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. అందునా ఎంట్రీ లెవెల్ కార్లు, హ్యాచ్‌బ్యాక్ క్యాటగిరీ కార్ల కంటే ఎస్యూవీ కార్లపైనే ప్రతి ఒక్కరూ మోజు పెంచుకుంటున్నారు. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) పట్ల పెరిగిన గిరాకీని సొమ్ము చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో మహీంద్రా అండ్ మహీంద్రా ముందు వరుసలో ఉంది. తాజాగా న్యూ స్కార్పియో క్లాసిక్ మోడల్ కారును ఆవిష్కరించింది. కొన్ని వారాల క్రితమే ఆవిష్కరించిన స్కార్పియో-ఎన్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఓల్డ్ జనరేషన్ స్కార్పియో అప్డేటెడ్ వర్షన్ కారే స్కార్పియో క్లాసిక్. రెండు వేరియంట్లు క్లాసిక్ ఎస్, క్లాసిక్ ఎస్11ల్లో వస్తున్న స్కార్పియో క్లాసిక్ ధరను మహీంద్రా ఈ నెల 20న ప్రకటించనున్నది.
పాత స్కార్పియో కారుతో పోలిస్తే సెంటర్లో న్యూ మహీంద్రా లోగో, క్రోమ్ స్లాట్స్‌తో రీడిజైన్ చేసిన గ్రిల్లేతో వస్తోంది స్కార్పియో క్లాసిక్. పాత కారు కంటే ఆకర్షణీయంగా బాయ్నెట్, బంపర్ బోల్డర్గా ఉంటాయి. గ్రిల్లెకు పక్కన న్యూ డీఆర్ఎల్స్ అమర్చారు. సిగ్నేచర్ స్కార్పియో టవర్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.
స్కార్పియో క్లాసిక్‌లో ఇంటీరియర్‌గా క్యాబిన్లో డ్యుయల్ టోన్ థీమ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఐదు ఎక్స్టీరియర్ కలర్స్ ఆప్షన్లలో స్కార్పియో క్లాసిక్ రూపుదిద్దుకున్నది. రెడ్ రేస్, నాపొలీ బ్లాక్, శాట్ సిల్వర్, పెర్ల్ వైట్, గెలాక్సీ గ్రే రంగుల్లో పొందొచ్చు.
2.2 లీటర్ల జన్-2 ఎంహాక్ సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్‌తో మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వస్తున్నది. ఇది గరిష్ఠంగా 132 పీఎస్‌ల ఇంధనం, 300 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది. పాత స్కార్పియోతో పోలిస్తే స్కార్పియో క్లాసిక్ 14 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

