రూ.92,000 పెరిగిన మహీంద్రా థార్

న్యూఢిల్లీ, జూలై 9: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. వాహన ధరలను మరోసారి పెంచినట్లు ప్రకటించింది. ఇందులో తమ పాపులర్ ఎస్యూవీ ‘థార్’ ధర కనిష్ఠంగా రూ.32,000, గరిష్ఠంగా రూ.92,000 పెరిగినట్లు తెలిపింది. ఆయా వేరియంట్ల ఆధారంగా ఈ ధరల పెంపు ఉంటుందని తాజాగా పేర్కొన్నది. ఈ నెల నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది. నిజానికి ఈ ఏడాది మొదలు వాహన ధరలను మహీంద్రా పెంచడం ఇది మూడోసారి. గతంలో ఫిబ్రవరి, మే నెలల్లో రెండుసార్లు పెంచింది. కాగా, బొలెరో, మరాజ్జో, స్కార్పియో, ఎక్స్‌యూవీ300 మరికొన్ని మోడల్స్ కార్ల ధరలూ పెరిగాయి. అయితే 2 నుంచి 3 శాతం మేరకే పెంపున్నది. ఇక తయారీ ఖర్చులు పెరగడమే ధరల పెంపునకు కారణమని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. అయితే వాహన శైలి, సాఫ్ట్‌టాప్, హార్డ్‌టాప్ తదితర కారణాల వల్ల థార్ ధర అధికంగా పెరుగుతున్నట్లు చెప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

