LPG Gas Hike | సామాన్యులకు షాక్ .. గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు..
LPG Gas Hike | సామాన్యులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఓ వైపు ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న జనం నెత్తిన మరోసారి భారం మోపాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒకేసారి రూ.50 ధరను పెంచాయి.
LPG Gas Hike | సామాన్యులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఓ వైపు ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న జనం నెత్తిన మరోసారి భారం మోపాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒకేసారి రూ.50 ధరను పెంచాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం ఎల్పీజీ ధరలను రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉజ్వల, సాధారణ కేటగిరీ వినియోగదారులకు గ్యాస్ ధరను పెంచినట్లు మంత్రి ప్రకటించారు. దాంతో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కి పెరగనున్నది. ఇక ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు 14.2 కేజీల సిలిండర్ ధర రూ.503 నుంచి రూ.553కి చేరనున్నది. పెరిగిన సిలిండర్ ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి.
ఇదిలా ఉండగా.. కేంద్రం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో.. పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో వాణిజ్య యుద్ధం భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమ్యాయి. ఈ క్రమంలో కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో అదనపు భారాన్ని కంపెనీలు సర్దుబాటు చేసుకుంటాయని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

