Loan Apps | ఈ రెండు లోన్ యాప్స్‌తో జాగ్రత్త..! రుణగ్రహీతలను హెచ్చిరించిన కేంద్ర ప్రభుత్వం..!
Loan Apps | భారత్‌లో గత రెండేళ్లలో ఆన్లైన్ రుణ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు సైతం గణనీయంగా పెరిగాయి. రుణ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతో మంది జీవితాలను చాలించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా లావాదేవీలు జరుపుతున్నాయి.
Loan Apps | భారత్‌లో గత రెండేళ్లలో ఆన్లైన్ రుణ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు సైతం గణనీయంగా పెరిగాయి. రుణ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతో మంది జీవితాలను చాలించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా లావాదేవీలు జరుపుతున్నాయి. సిబిల్ స్కోర్, ఇతర పత్రాలు ఏవీ లేకుండా రుణాలు ఇస్తూ ఆ తర్వాత రుణగ్రహీతలను బ్లాక్ చేయిస్తున్నాయి. ఇప్పటికే వేధింపులకు గురి చేస్తున్న 50కిపైగా లోన్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే, ప్రతి రోజూ కొత్త కొత్త రుణ యాప్‌లు పుట్టుకువస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త రుణ యాప్‌లకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న సైబర్డోస్ట్ అనే సైట్.. ఈ రెండు యాప్‌లలో రుణం తీసుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ట్విట్టర్ ద్వారా సూచించింది.

పలు యాప్‌లు దేశాలకు చెందిన సంస్థలను నిర్వహిస్తున్నాయని, ఎవరైనా సైబర్ నేరాల బారినపడితే బాధితులు 1930 డయల్ చేయాలని లేదంటే.. cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రభుత్వం హెచ్చరించిన రుణ యాప్‌లలో విండ్మిల్ మనీ (Windmill Money), ర్యాపిడ్ రూపీ ప్రో (Rapid Rupee Pro) ఉన్నాయి. ఈ రెండు యాప్‌లు దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఓ వినియోగదారుడు ట్విట్టర్లో స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. విండ్మిల్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండగా.. ర్యాపిడ్ రూపీ ప్రో యాప్‌ను తొలగించారు. యాప్‌లో రివ్యూలన్నీ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటున్నాయి. పే స్టోర్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. Windmill Money యాప్‌ను STCI ప్రైమరీ డీలర్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. అయితే STCI సైట్లో ఈ యాప్‌ను కంపెనీ అభివృద్ధి చేయలేదని, తమకు సంబంధం లేదని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా యాప్‌లో రుణాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

