ఎల్ఐసీ నుంచి 3-4 కొత్త పాలసీలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించేందుకు వచ్చే కొద్ది నెలల్లో 3-4 కొత్త పాలసీలను ప్రవేశపెట్టేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సిద్ధమవుతున్నది. ‘నిరుడుతో పోలిస్తే ఆదాయ వృద్ధి రెండంకెల్లో ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం.
న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించేందుకు వచ్చే కొద్ది నెలల్లో 3-4 కొత్త పాలసీలను ప్రవేశపెట్టేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సిద్ధమవుతున్నది. ‘నిరుడుతో పోలిస్తే ఆదాయ వృద్ధి రెండంకెల్లో ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. ఇటీవల రిటైల్ వ్యాపారం మెరుగుపడుతున్నందున, అంచనాల మేరకు వృద్ధి సాధిస్తాం. ఇందుకు తోడు కొన్ని కొత్త ఆకర్షణీయమైన ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టబోతున్నాం’ అంటూ ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి చెప్పారు. డిసెంబర్ తొలివారంలో ఎల్ఐసీ ఒక కొత్త పాలసీని విడుదల చేస్తుందని, అది మార్కెట్‌ను ఎంతగానో ఆకర్షిస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.
గ్యారంటీ రాబడి హామీతో పాలసీ
డిసెంబర్లో విడుదల చేయనున్న పాలసీకి చెందిన కొన్ని ఫీచర్లను మొహంతి వివరిస్తూ హామీ మేరకు రాబడిని అందిస్తుందని, కాలపరిమితి ముగిసిన తర్వాత బీమా మొత్తంలో 10 శాతం చొప్పున పాలసీదారు జీవితాంతం అందుకుంటాడని తెలిపారు. ఈ కొత్త ప్రాడక్ట్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుందని, 20-25 ఏండ్ల తర్వాత అందుకునే రాబడుల కోసం ఇప్పుడు ఎంత చెల్లించాలన్నది తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపిస్తారన్నారు. ఈ కొత్త పాలసీపై రుణ సదుపాయం, కాలపరిమితికి ముందే విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉన్నది. పాలసీదార్లు, షేర్‌హోల్డర్ల ప్రయోజనం కోసమే గ్యారంటీ రాబడి పాలసీలు ప్రవేశపెడుతున్నామని, తమ కంపెనీలో మదుపు చేసిన వారిలో చాలావరకూ పాలసీదారులేనని వివరించారు. తదుపరి నెలల్లో మరో 2-3 పాలసీలు తెస్తామన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- FY24
- lic
- new Products
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

