ఎల్ఐసీ అగ్గువ రుణాలు

- పాలసీదారులకు తక్కువ మిత్తికే పర్సనల్ లోన్స్
- 9% ప్రారంభ వడ్డీరేటుకే లభ్యం
- ప్రీ-క్లోజర్ చార్జీలూ లేవు
ముంబై, డిసెంబర్ 10: మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా?.. అయితే మీరు సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. వడ్డీరేటు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే చాలా తక్కువ. అవును.. ఎల్ఐసీ వ్యక్తిగత రుణాలు 9 శాతం ప్రారంభ వడ్డీరేటుకే లభిస్తున్నాయి మరి. ఈ ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ.. ప్రజల కోసం అనేక పథకాలు, పాలసీలను అందిస్తున్న విషయం తెలిసిందే. పాలసీదారులకు రుణ సదుపాయంసహా ఎన్నో ఆఫర్లనూ కల్పిస్తున్న సంగతి విదితమే.
ఎంత రుణం పొందవచ్చు?
మీ పాలసీ సరెండర్ వాల్యూ ఆధారంగా మీకు ఎంత వ్యక్తిగత రుణం వస్తుందో ఎల్ఐసీ తేలుస్తుంది. ఈ వాల్యూలో 90 శాతం వరకు లోన్‌గా పొందవచ్చు. ఉదాహరణకు మీ పాలసీ సరెండర్ వాల్యూ రూ.5 లక్షలుగా ఉంటే.. మీకు రూ.4.5 లక్షల వరకు పర్సనల్ లోన్ వస్తుంది. రుణ కాలపరిమితి గరిష్ఠంగా ఐదేండ్లు. మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే వడ్డీరేటును నిర్ణయిస్తారు. మీ ఆదాయ మార్గాలు, తీసుకునే రుణ మొత్తం, చెల్లించే వాయిదాలు కూడా వడ్డీరేట్లను ప్రభావితం చేస్తాయి. ఇక రుణగ్రహీతలకు బంపర్ ఆఫర్ ఏంటంటే ప్రీ-క్లోజర్ చార్జీలుండవు. మీ వద్ద నగదు ఉంటే గడువులోపే రుణాన్ని తీర్చేయవచ్చు. ఇందుకోసం ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించనక్కర్లేదు. అలాగే చెల్లించాల్సిన రుణ మొత్తానికే నెలనెలా వడ్డీరేట్లను లెక్కించి ఈఎంఐలుగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు మీరు రూ.5 లక్షలు రుణం తీసుకుని నెలనెలా చెల్లిస్తూ రూ.2 లక్షలకు దాన్ని తగ్గిస్తే అంతకే మీరు చెల్లించే వడ్డీ ఉంటుందన్నమాట.
ఆన్లైన్ దరఖాస్తు ఇలా..
ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హోం పేజీ తెరుచుకున్న తర్వాత స్క్రీన్‌పై కనిపించే ఆన్లైన్ సర్వీస్ (ఎడమవైపు) కింద ఉన్న ‘ఆన్లైన్ లోన్’పై క్లిక్ చేయాలి.
‘ఆన్లైన్ లోన్’పై క్లిక్ చేస్తే కొత్త పేజీ తెరుచుకుంటుంది. ఇందులో లోన్ రీపేమెంట్, ఆన్లైన్ లోన్ రిక్వెస్ట్ అని ఉంటాయి.
ఆన్లైన్ లోన్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేసి మీ కస్టమర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీని టైప్ చేయాలి.
అనంతరం మీ పాలసీ నంబర్‌కు మీ బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేస్తే.. రుణ మొత్తం సదరు అకౌంట్లో జమ అవుతుంది.
9% వడ్డీరేటుపై ఈఎంఐలు ఇలా (రూ.లలో)
కాలపరిమితి రూ.లక్షకు రూ.5 లక్షలకు
ఏడాది 8,745 44,191
రెండేండ్లు 4,568 23,304
మూడేండ్లు 3,180 18,472
నాలుగేండ్లు 2,489 15,000
ఐదేండ్లు 2,076 12,917
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- personal loan
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

