ఎల్ఐసీ లోన్ అగ్గువ
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నది. బ్యాంకింగ్ సంస్థలతో పోల్చితే అగ్గువకే ఈ లోన్లు లభిస్తుండటం గమనార్హం. ఐదేండ్ల గరిష్ఠ కాలపరిమితితో ఉన్న ఈ రుణాలను 9 శాతం కనిష్ఠ వడ్డీరేటుకే ఎల్ఐసీ ఇస్తున్నది మరి. ఇక గడువు లోపలే చెల్లిస్తే అదనపు చార్జీల నుంచి కూడా రుణగ్రహీతలకు మినహాయింపు
- 9% వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలు
న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నది. బ్యాంకింగ్ సంస్థలతో పోల్చితే అగ్గువకే ఈ లోన్లు లభిస్తుండటం గమనార్హం. ఐదేండ్ల గరిష్ఠ కాలపరిమితితో ఉన్న ఈ రుణాలను 9 శాతం కనిష్ఠ వడ్డీరేటుకే ఎల్ఐసీ ఇస్తున్నది మరి. ఇక గడువు లోపలే చెల్లిస్తే అదనపు చార్జీల నుంచి కూడా రుణగ్రహీతలకు మినహాయింపు ఉండటం విశేషం. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు పెంపుతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు ఎగబాకిన విషయం తెలిసిందే. దీంతో గృహ రుణాలపైనా వడ్డీరేటు 8-9 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఎక్కువ వడ్డీరేటుకు అందుబాటులో ఉండే వ్యక్తిగత రుణాలను ఎల్ఐసీ ఇంత తక్కువ వడ్డీరేటుకు ఆఫర్ చేస్తుండటం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
వ్యక్తిగత రుణం పొందడమెలా?..
- తొలుత ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ www.licindia.in ను సందర్శించాలి
- ఆపై పాలసీ లోన్ ఆప్షన్‌కు వెళ్లాలి
- లోన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి
- అనంతరం ఫారాన్ని నింపాలి
- పూర్తయ్యాక స్కాన్ చేసి ఫారాన్ని అప్లోడ్ చేయాలి
- మీ అభ్యర్థనను పరిశీలించి ఎల్ఐసీ తుది నిర్ణయం తీసుకుంటుంది
రుణం మంజూరైతే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది

Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- lic
- loan
- Low interest
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

