LIC IPO | ఎల్ఐసీ ఐపీవో.. పాలసీదారులు.. రిటైల్ ఇన్వెస్టర్లకు గైడ్‌లైన్స్ ఇవే
LIC IPO | ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేవారు కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. డీమ్యాట్ ఖాతా కలిగి ఉండటంతోపాటు పాలసీతో పాన్ అనుసంధానించాలి.
LIC IPO | ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో గురించే ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. దేశీయ స్టాక్‌మార్కెట్ల చరిత్రలోనే అతి పెద్ద ఐపీవో కానున్నది. సుమారు రూ.21 వేల కోట్ల నిధులను ఎల్ఐసీ..ఐపీవో ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించనున్నది. బీమా రంగంలోనే ప్రపంచంలోనే ఐదో సంస్థగా పేరొందింది ఎల్ఐసీ. అటువంటి సంస్థ ఐపీవో కోసం దరఖాస్తు చేసుకునే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- ఎల్ఐసీ ఐపీవో పాల్గొనాలని భావించే వారు డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి.
- ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉంటే.. కొత్తగా ఖాతా తెరవాల్సిన పని లేదు. ఉన్న ఖాతాతోనే ఐపీవో బిడ్ దాఖలు చేయొచ్చు.
- డీమ్యాట్ ఖాతా ప్రారంభించే వారు తప్పనిసరిగా పాన్‌కార్డు కలిగి ఉండాలి. ఆధార్ ఓటీపీ ద్వారా ఖాతా ప్రారంభం పూర్తవుతుంది.
- ఇప్పటికే డీమ్యాట్ ఖాతా కలిగి ఉన్న వారు దాన్ని ఒకసారి చెక్‌చేసుకుంటే మంచిది. మీ వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్, పాన్ & ఆధార్ కార్డు నంబర్లు, ఫోన్ నంబర్ తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయా? అన్న సంగతి సరి చూసుకుంటే బాగుంటుంది. యూజర్ ఐడీతోపాటు కొత్త పాస్వర్డ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది.
- కొత్త ఐపీవోలపై ఆసక్తి గల వారు డీమ్యాట్ ఖాతా తెరవాలని కోరుకోవచ్చు.
- అయితే, అన్ని బ్యాంకులు డిజిటల్ పద్దతిలో ఖాతాలు తెరుస్తున్నాయి.
- బ్రోకరేజీ సంస్థలు కూడా డిజిటల్ రూపంలోనే బ్యాంక్ ఖాతాలు ఇస్తున్నందున.. మీకు నచ్చిన సంస్థలో బ్యాంక్ ఖాతా తెరవచ్చు. కొన్ని గంటల్లోనే డీమ్యాట్ ఖాతా మొదలవుతుంది.
- కొన్నిసంస్థలు కొన్ని పర్సనల్ డేటా పత్రాలు అడుగుతాయి. ఇటువంటి సంస్థల్లో ఖాతాలు తెరవడం జాప్యం కావచ్చు.
- ఎల్ఐసీ పాలసీదారులకు ఐపీవోలో షేర్‌పై రూ.60 రాయితీ లభిస్తుంది. ఈ రాయితీ పొందాలంటే ఫిబ్రవరి 13లోపు ఏదో ఒక పాలసీలో సభ్యులుగా ఉండాలి. గత ఫిబ్రవరి 28 లోపు పాలసీకి పాన్ కార్డు అనుసంధానించాలి.
- పాలసీ ఉన్నా గడువులోపు అప్డేట్ చేయని వారు రిటైల్ కోటా కింద దరఖాస్తు చేసుకుంటే రూ.45 డిస్కౌంట్ లభిస్తుంది.
- ఒకటికంటే ఎక్కవ డీమ్యాట్ ఖాతాలు ఉన్నా.. ఎల్ఐసీ ఐపీవోలో షేర్ల కొనుగోలుకు ఒక్క డీమ్యాట్ ఖాతా నుంచే బిడ్ దాఖలుచేయాలి. వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వస్తే, ఒకటికంటే ఎక్కువ అప్లికేషన్లు భావించి షేర్ల కేటాయింపు నిలిపివేయొచ్చు. ఒక్కోసారి మీరు చెల్లించిన డబ్బు కూడా వెనక్కి రాకపోవచ్చు. ఒక ఖాతా నుంచి ఒక లాట్ (15 షేర్లు) నుంచి 15 లాట్లకు బిడ్ దాఖలు చేయొచ్చు.
ఎల్ఐసీ ఐపీవో టైంటేబుల్ ఇలా!
మే నాలుగో తేదీన ఎల్ఐసీ ఐపీవో మొదలవుతుంది. తొమ్మిదో తేదీన ముగుస్తుంది. రూ.902-949 మధ్య ఎల్ఐసీ షేర్ ఖరారు కానుంది. ఒక్కో షేర్‌పై ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45, పాలసీదారులకు రూ.60 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

