LIC Amritbaal | ఎల్ఐసీ సరికొత్త పాలసీ.. పిల్లల కోసం అమృత్బాల్
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. పిల్లల కోసం ‘అమృత్బాల్' పేరిట ఓ సరికొత్త పాలసీని పరిచయం చేసింది.
LIC Amritbaal | ముంబై, ఫిబ్రవరి 17: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. పిల్లల కోసం ‘అమృత్బాల్’ పేరిట ఓ సరికొత్త పాలసీని పరిచయం చేసింది. ఇదో వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. పిల్లల ఉన్నత విద్య, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పాలసీని రూపొందించారు. ఏజెంట్లు, ఇతర మధ్యవర్తుల ద్వారా దీన్ని కొనవచ్చు. సంస్థ అధికారిక వెబ్సైట్ www.licindia.in ద్వారా ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు.
- 30 రోజులు-13 ఏండ్ల పిల్లలు అర్హులు.
- మెచ్యూరిటీ కనీస వయస్సు 18 ఏండ్లు. గరిష్ఠం 25 సంవత్సరాలు.
- షార్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 5, 6 లేదా 7 ఏండ్లు.
- కనీస పాలసీ టర్మ్ కోసం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 10 ఏండ్లు. సింగిల్ ప్రీమియం పేమెంట్ కోసం 5 ఏండ్లు.
- గరిష్ఠ పాలసీ టర్మ్ కోసం లిమిటెడ్/సింగిల్ ప్రీమియం పేమెంట్ 25 ఏండ్లు. పీవోఎస్పీ-ఎల్ఐ/సీపీఎస్సీ-ఎస్పీవీ ద్వారా పొందే పాలసీలకు 20 ఏండ్లు.
- మినిమం సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ఠ బేసిక్ సమ్ అష్యూర్డ్ కోసం పరిమితి లేదు (షరతులు వర్తిస్తాయి).
- షరతులకు లోబడి పాలసీ వ్యవధిలో రుణ సదుపాయం లభిస్తుంది.
- అర్హత నిబంధనలకు లోబడి అదనపు ప్రీమియం చెల్లిస్తే ఎల్ఐసీ ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ సదుపాయం.
- హై బేసిక్ సమ్ అష్యూర్డ్, ఆన్లైన్ సేల్ కింద పూర్తయిన ప్రతిపాదనకు రిబేటు.
- మెచ్యూరిటీ మొత్తాన్ని పొందేందుకు 5, 10 లేదా 15 ఏండ్ల వాయిదాల్లో సెటిల్మెంట్ ఆప్షన్లు.
- మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్లపై పాలసీ వ్యవధిలో గ్యారంటీడ్ అడిషన్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

