న్యూఢిల్లీ : ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ జాన్ డీర్.. మార్కెట్లోకి 5130 ఎం సిరీస్ ట్రాక్టర్లను పరిచయం చేసింది. వ్యవసాయ రంగంలో వస్తున్న డిజిటల్ మార్పులకు అనుగుణంగా ఈ నయా ట్రాక్టర్లను తీర్చిదిద్దినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
5 ఎం సిరీస్లో భాగంగా ప్రవేశపెట్టిన 5130 ఎం ట్రాక్టర్ 130 హెచ్పీ సామర్థ్యంతో పనిచేయనున్నది.