Layoff | నాలుగువేల మంది ఉద్యోగుల మెడపై ‘డిస్నీ’ కత్తి..! ఏప్రిల్ నుంచి తొలగింపులు..!
Layoff | ఎంటర్టైన్మెంట్ రంగ దిగ్గజం డిస్నీ 4వేల మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నది. రిట్రెంచ్ చేయాల్సి ఉద్యోగులను గుర్తించాలని కంపెనీ.. మేనేజర్లను ఆదేశించినట్లు సమాచారం. ఏప్రిల్‌లో కంపెనీ తొలగింపులను చేపట్టనున్నది.
Layoff | ఎంటర్టైన్మెంట్ రంగ దిగ్గజం డిస్నీ 4వేల మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నది. రిట్రెంచ్ చేయాల్సి ఉద్యోగులను గుర్తించాలని కంపెనీ.. మేనేజర్లను ఆదేశించినట్లు సమాచారం. ఏప్రిల్‌లో కంపెనీ తొలగింపులను చేపట్టనున్నది. అయితే, ఉద్యోగుల తొలగింపు చిన్న చిన్న గ్రూప్‌లుగా తొలగిస్తారా..? లేదంటే ఒకేసారి నాలుగువేల మందిని ఇంటికి పంపుతారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏప్రిల్ 3న డిస్నీ వార్షిక సమావేశం జరగనుంది.
వాస్తవానికి కంపెనీ ఏడు బిలియన్ డాలర్లు చేయాలని భావిస్తుందని, ఇదే తొలగింపులకు కారణంగా తెలుస్తున్నది. ఎంటర్టైన్మెంట్ కంపెనీ తన స్ట్రీమింగ్ సర్వీస్ హులుపై దృష్టి పెట్టి.. స్ట్రీమింగ్ సర్వీస్ బిజినెస్‌ను తగ్గించుకునే అవకాశం ఉన్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంతకు ముందు కంపెనీ సీఈవో బాబ్ ఇగర్ ఫిబ్రవరిలో 7వేల మంది ఉద్యోగులను డిస్నీ తొలగిస్తుందని ప్రకటించారు. దాంతో దీంతో కంపెనీకి దాదాపు ఏడు బిలియన్ డాలర్లు ఆదా కానున్నది.
అదే సమయంలో కంటెంట్‌ను తగ్గించడంతో పాటు ఉద్యోగుల జీతంలోనూ కోత పెట్టేందుకు కంపెనీ యోచిస్తున్నది. ఇదిలా ఉండగా.. పలు కంపెనీలు సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పక్కనపెడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో వైపు మెటా సంస్థలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నది. దాదాపు 10వేల మంది ఉద్యోగులను తొలగించాలని మెటా యోచిస్తున్నది. ఇప్పటికే దాదాపు 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కూడా తన ఉద్యోగులలో 15 శాతం మందిని తగ్గించుకోవాలని ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా దాదాపు 1500 మంది ఉద్యోగులను పక్కనబెట్టింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

