Lava Yuva Smart | ఏఐ పవర్డ్ ఫీచర్లతో లావా యువ స్మార్ట్.. రూ.6000లకే లభ్యం..!
Lava Yuva Smart | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ భారత్ మార్కెట్లోకి ఏఐ పవర్డ్ కెమెరాతో లావా యువ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది.
Lava Yuva Smart | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) భారత్ మార్కెట్లో సోమవారం లావా యువ స్మార్ట్ (Lava Yuva Smart) ఫోన్ ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మద్దతుతో 13-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నదీ స్మార్ట్ ఫోన్. రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుంది. 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.75 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. లావా యువ స్మార్ట్ (Lava Yuva Smart) ఫోన్ ఇంట్రడ్యూసరీ ధర రూ.6000గా ప్రకటించింది లావా ఇంటర్నేషనల్.
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లోనూ లభిస్తుందీ లావా యువ స్మార్ట్ (Lava Yuva Smart) ఫోన్. గ్లాసీ బ్లూ, గ్లాసీ లావెండర్, గ్లాసీ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తున్న ఈ ఫోన్‌పై ఏడాది వారంటీ, ఫ్రీ సర్వీస్ ఎట్ హోం అందిస్తుంది. యూనిసోక్ 9863ఏ ఒక్టోకార్ ప్రాసెసర్, 3జీబీ + 3జీబీ (వర్చువల్) ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 512 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 గో వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్.
లావా యువ స్మార్ట్ (Lava Yuva Smart) ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు 13 – మెగా పిక్సలె డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఏఐ పవర్డ్, హెచ్డీఆర్ మద్దతుతో పోర్ట్రైట్, నైట్ మోడ్లకు మద్దతుగా నిలుస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. స్లో మోషన్ వీడియో, ఏఐ మోడ్స్ ఉంటాయి. డ్యుయల్ 4జీ వోల్ట్, వై-ఫై 5,బ్లూటూత్ 4.2, ఓటీజీ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. 10వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, క్యూఆర్ కోడ్ స్కానర్ బ్యాటరీ సేవర్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

