Lava Yuva 3 | భారత్ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ లావా యువ 3.. ధరెంతో తెలుసా..?!
Lava Yuva 3 | లావా ఇంటర్నేషనల్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ‘లావా యువ3’ ఆవిష్కరించింది.
Lava Yuva 3 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా (Lava) తన లావా యువ 3 (Lava Yuva3) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇంతకుముందు ఆవిష్కరించిన లావా యువ 2 (Lava Yuva 2) ఫోన్ కొనసాగింపుగా గత డిసెంబర్లో లావా యువ 3 (Lava Yuva 3) ఫోన్‌ను ఆవిష్కరించింది. తాజాగా మార్కెట్లోకి వచ్చిన లావా యువ 3 (Lava Yuva 3) ఫోన్ 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో ఒక్టాకోర్ యూనిసోక్ ఎస్వోసీ చిప్ సెట్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తున్న ఈ ఫోన్‌కు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 వర్షన్ అప్ డేట్ చేస్తారు. మూడు కలర్ ఆప్షన్లు, రెండు ర్యామ్ అండ్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
లావా యువ 3 (Lava Yuva 3) ఫోన్ కాస్మిక్ లావెండర్ (Cosmic Lavender), ఎక్లిప్స్ బ్లాక్ (Eclipse Black), గెలాక్సీ వైట్ (Galaxy White) షేడ్ల్లో లభిస్తుంది. లావా యువ 3 ((Lava Yuva 3) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,799తో ప్రారంభం అవుతుంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299లకు లభిస్తుంది. ఈ నెల ఏడో తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, లావా ఈ-స్టోర్‌లో, ఈ నెల 10 నుంచి ప్రధాన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
లావా యువ 3 ((Lava Yuva 3) ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ+ (720×1600 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. ఇది ఒక్టాకోర్ యూనిసోక్ టీ 606 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్ గల ఫోన్ జీబీ కెపాసిటీని వర్చువల్‌గా మరో 4 జీబీ పెంచుకోవచ్చు.
లావా యువ 3 (Lava Yuva 3) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ అన్ స్పెసిఫైడ్ ఏఐ-బ్యాక్డ్ సెన్సర్ అండ్ వీజీఏ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. 18వాట్ల చార్జింగ్ మద్దతుతో లావా యువ 3 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 4జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

