Lava Yuva 2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా.. భారత్ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ‘లావా యువ 2 (Lava Yuva 2)’ ఫోన్ ఆవిష్కరించింది. లావా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ పానెల్ కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. భారత్ మార్కెట్లో 3జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.6,999గా ఖరారు చేశారు. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ లావెండర్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 12 వర్షన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. 6.51-అంగుళాల హెచ్డీ+ (720×1600 పిక్సెల్స్ రిజొల్యూషన్) డిస్ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అండ్ 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. సెల్ఫీ షూటర్ కోసం వాటర్ డ్రాన్ స్టైల్ కటౌట్ స్క్రీన్ ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నది. 3జీ రామ్ గల పోన్ వర్చువల్ గా 6జీబీ రామ్ వరకు పొడిగించుకోవచ్చు.
లావా యువ2 ఫోన్ 13-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తున్నది. హెచ్డీఆర్, పోర్ట్రైట్, బ్యూటీ, స్లో మోషన్తోపాటు ప్రీలోడెడ్ కెమెరా మోడ్స్, ఫిల్టర్స్ తోకూడిన రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ స్క్రీన్ ఫ్లాస్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
లావా యువ2 ఫోన్ 4జీ, బ్లూటూత్5, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరోమీటర్, ఆంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్లు ఉన్నాయి. బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, అథంటికేసన్ కోసం ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంటాయి.
లావా యువ2 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ ఫర్ 10 వాట్ల చార్జింగ్ ఉంటుంది. ఈ బ్యాటరీ 40 గంటల టాక్ టైం, 533 నిమిషాల యూ-ట్యూబ్ ప్లేబ్యాక్ టైం, 600 గంటల వరకు స్టాండ్‌బై టైం కలిగి ఉంటుంది.