Lava Yuva 2 5G | లావా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ లావా యువ 2 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Lava Yuva 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) శుక్రవారం భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా యువ 2 5జీ (Lava Yuva 2 5G) ఆవిష్కరించింది.
Lava Yuva 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) శుక్రవారం భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా యువ 2 5జీ (Lava Yuva 2 5G) ఆవిష్కరించింది. ఏఐ బ్యాక్డ్ ఫీచర్లతో 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. యాప్ అలర్ట్స్ లేదా షోయింగ్ సిస్టమ్ కోసం నోటిఫికేషన్ లైట్ ఫీచర్ జత చేశారు. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. గత మే నెలలో భారత్ మార్కెట్లో లావా యువ 5జీ ఫస్ట్ జనరేషన్ ఫోన్ ఆవిష్కరించారు.
లావా యువ2 5జీ (Lava Yuva 2 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,499 పలుకుతుంది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో విక్రయిస్తారా? లేదా? తెలియదు. మార్బుల్ బ్లాక్, మార్బుల్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఏడాది వారంటీతోపాటు ఫ్రీ @ హోం సర్వీస్ లభిస్తుంది. 700 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్ ఉంటాయి. యూనిసోక్ టీ760 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్‌గా ఫోన్ ర్యామ్ మరో 4 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.
లావా యువ2 5జీ (Lava Yuva 2 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుంది. ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రేర్ కెమెరా మాడ్యుల్తోపాటు నోటిఫికేషన్ లైట్ యూనిట్ ఉంటుంది. 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డ్యుయల్ స్టీరియో స్పీకర్ యూనిట్ ఉంటది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింగ్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

