Lava Blaze Curve 5G | మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Lava Blaze Curve 5G | ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ .. భారత్ మార్కెట్లోకి తన లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
Lava Blaze Curve 5G | ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) భారత్ మార్కెట్లోకి తన లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ ఆవిష్కరించింది. రెండు రంగుల ఆప్షన్లతో వస్తున్న లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.67-అంగుళాల 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 64-మెగా పిక్సెల్స్ సెన్సర్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంది. డోల్బీ ఆట్మోస్ పవర్డ్ స్టీరియో స్పీకర్లు, 33 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంది.
లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999లకు లభిస్తాయి. ఐరన్ గ్లాస్ విరిడియాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 11 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, లావా ఈ-స్టోర్, ఇతర రిటైల్ ఔట్లెట్లలో అందుబాటులో ఉంటుంది.
లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14తోపాటు మూడేండ్ల వరకూ త్రైమాసికానికోసారి సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. హెచ్డీఆర్, హెచ్డీఆర్ 10, హెచ్డీఆర్ 10+, వైడివైన్ ఎల్1లకు మద్దతుగా ఈ డిస్ ప్లే ఉంటుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 16 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ గల లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్లో 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ సపోర్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా విత్ స్క్రీన్ ఫ్లాష్ ఉంటాయి. లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, ఎఫ్ఎం రేడియో, వై-ఫై 802.11ఏ/ బీ/ జీ/ ఎన్ / ఏసీ/ ఏఎక్స్, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

