Lava Blaze 5G | 8జీబీ రామ్‌తో లావా బ్లేజ్ 5జీ ఫోన్.. ధరెంతంటే..?!
Lava Blaze 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా తన బ్లేజ్ 5జీ ఫోన్ 8జీబీ రామ్ వేరియంట్లోనూ ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.12,999లకే లభిస్తుంది.
Lava Blaze 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా భారత్ మార్కెట్లో లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) 8 జీబీ రామ్ వేరియంట్ కూడా లభిస్తుంది. గతేడాది నవంబర్‌లో 4జీబీ రామ్ కెపాసిటీతో మార్కెట్లో విడుదల చేసిన లావా.. తాజాగా 8జీబీ రామ్‌తో కొత్త ఫోన్ ఆవిష్కరించింది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) 4జీబీ రామ్ వేరియంట్ ధర రూ.15,000. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) 8జీబీ రామ్ వేరియంట్ ఆండ్రాయిడ్-13 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుంది. వర్చువల్‌గా మరో 8జీబీ రామ్ పెంచుకోవచ్చు.
లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్.. లావా ఆన్లైన్ స్టోర్, అమెజాన్‌ల్లో బుక్ చేస్తే రూ.12,999లకు లభిస్తుంది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) ఫోన్లు 4జీబీ, 6జీబీ రామ్ ఆప్షన్ ఫోన్లు రూ.10,999, రూ.11,999లకు లభిస్తాయి. ఈ ఫోన్లు గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్లలో పొందొచ్చు.
డ్యుయల్-సిమ్ ఆప్షన్ గల లావా బ్లేజ్ 5జీ ఫోన్ 6.51-అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ (720×1600 పిక్సెల్స్ రిజొల్యూషన్) విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్‌రేట్‌తో వస్తుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీ చిప్ సెట్ విత్ 8జీబీ రామ్ అండ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించవచ్చు. రామ్ కూడా వర్చువల్‌గా 8 జీబీ రామ్ వరకూ పెంచుకోవచ్చు.
50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్)తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ చార్జింగ్ కలిగి ఉంటది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

