హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సలో వినియోగించే ‘2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్’ (2డీజీ)ని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్స్ కూడా ఉత్పత్తి చేయనున్నది. ఇప్పటికే రెడ్డీస్ ల్యాబ్స్ ‘2డీజీ’ బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో సాచెట్ ధర రూ.990గా ఉన్నది. ఈ నేపథ్యంలో డీఆర్డీవో నుంచి లారస్ ల్యాబ్స్కూ 2డీజీ తయారీ, మార్కెటింగ్ లైసెన్స్ లభించింది. ఈ మేరకు శుక్రవారం సంస్థ తెలియజేసింది.