IT Returns | నెలాఖరులోపు ఐటీఆర్ ఫైల్ చేయకుంటే.. ఫైన్ పడుద్ది.. ఎంతంటే?!
ITR Filing | ఈ నెలాఖరులోగా ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. గడువు లోపు ఫైల్ చేయకుంటే రూ.5000 వరకు లేట్ ఫీజు పే చేయాల్సి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
IT Returns | గత ఆర్థిక సంవత్సరం (ప్రస్తుత అంచనా సంవత్సరం 2023-24) ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ పరిస్థితుల్లో మీరు ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయకుంటే.. సాధ్యమైనంత త్వరగా ఫైల్ చేయండి. ఒకవేళ మీరు ఐటీఆర్ గడువు లోపు ఫైల్ చేయకపోతే లేట్ ఫీజు రూపంలో రూ.5000 చెల్లించాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్‌లో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటివద్ద నుంచే మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
తొలుత మనమంతా ఆదాయం పన్ను విభాగం అధికారిక వెబ్సైట్ (https :// incometax.gov.in/iec/foservices/#/login) లోకి వెళ్లి అక్కడ అడిగిన సమాచారం నమోదు చేయాలి.
ఆదాయం పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత మీ యూజర్ ఐడీ ( అప్పటికీ ఐటీ పోర్టల్‌లో మీ పేరు రిజిస్టర్ కాకపోతే, తొలుత రిజిస్టర్ చేసుకోవాలి) నింపి.. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అటుపై పాస్ వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి.
లాగిన్ అయిన తర్వాత ఓపెన్ అయిన పేజీలో ఈ-ఫైల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ ఆప్షన్ ఫైల్ ఎంచుకోవాలి.
అంచనా సంవత్సరం (2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేస్తే.. 2023-24 అంచనా సంవత్సరం) నమోదు చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి.
ఆఫ్లైన్లోనూ, ఆన్ లైన్ ఆప్షన్ ఎంచుకుని ఐటీఆర్ ఫైలింగ్ చేయొచ్చు. ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకున్నాక.. ‘పర్సనల్’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మీరు ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-4 వరకు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుని కంటిన్యూ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీరు వేతన జీవులైతే ఐటీఆర్-1 ఫామ్ సెలెక్ట్ చేసుకుని.. మీ కంప్యూటర్లో డౌన్ లోడ్ చేసుకోవాలి.
‘ఫైలింగ్ టైప్’లోకి వెళ్లి 139 (1) సెలెక్ట్ చేసి – వర్జినల్ రిటర్న్’లోకి వెళ్లాలి.
దీని తర్వాత మీరు డౌన్ లోడ్ చేసుకున్న ఐటీఆర్-1 ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో బ్యాంకు ఖాతా సమాచారం, ఫోన్ నంబర్, తదితర అన్ని రకాల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి.
ఒకవేళ ఆఫ్‌లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే డౌన్ లోడ్ చేసుకున్న ఫామ్‌లో సమాచారం నింపిన తర్వాత అటాచ్ ఫైల్ ఆప్షన్‌లోకి వెళ్లి అడిగిన డాక్యుమెంట్లు అటాచ్ చేయాలి.
అడిగిన డాక్యుమెంట్లు అటాచ్ చేసిన తర్వాత ఐటీ పోర్టల్.. వాటిని వాల్యుడేట్ చేస్తుంది. వాల్యుడేషన్ పూర్తయిన తర్వాత ‘ప్రొసీడ్ టూ వెరిఫికేషన్’ మీద క్లిక్ చేయాలి.
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత.. ఐటీఆర్ స్టేటస్ మీద క్లిక్ చేసి, ఎకనాలెడ్జ్మెంట్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేస్తే.. మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

