న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో లేటెస్ట్ ఫీచర్లతో స్పోర్ట్స్ కార్ లంబోర్గిని హరకేన్ ఎస్టీఓ లాంఛ్ అయింది. హరకేన్ సూపర్ ట్రోఫియో ఈవీఓ, హరకేన్ జీటీ3 ఈవీఓ రేస్ కార్ల ఇన్స్పిరేషన్తో తీర్చిదిద్దిన ఈ కారు రూ 4.99 కోట్ల ఎక్స్‌షోరూం ధరకు అందుబాటులో ఉంది. హరకేన్ పెర్ఫామెంట్ కంటే ఎయిర్‌ఫ్లో సామర్ధ్యం 37 శాతం, డౌన్ఫోర్స్లో 53 శాతం పెరుగుదల చేపట్టామని లంబోర్గిని పేర్కొంది.
లంబోర్గిని హరకేన్ ఎస్టీఓ లాంఛ్ సందర్భంగా తమకు భారత మార్కెట్ అత్యంత కీలకమని లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ మోడల్స్‌కు ఇక్కడ మెరుగైన డిమాండ్ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. హరకేన్ ఎస్టీఓతో సూపర్ స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్లో నూతన కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉంటుందని ఆయన పేర్కొన్నారు.