Birla Meets Ashwini Vaishnaw |కేంద్రమంత్రి అశ్వినితో బిర్లా భేటీ..! ఏం జరుగుతోంది..?!
Birla Meets Ashwini Vaishnaw | ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీజీ) చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా.. కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని...

Birla Meets Ashwini Vaishnaw | ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీజీ) చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా.. కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. వొడాఫోన్ ఐడియా (వీఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన నెల రోజులకు కేంద్ర మంత్రితో బిర్లా బుధవారంతో భేటీ కావడం గమనార్హం. అప్పుల ఊబిలో చిక్కుకున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు ఉద్ధీపన చర్యలను ప్రకటించే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, బిర్లా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఉద్దీపన ప్యాకేజీ పక్కా..
కేంద్రమంత్రి వైష్ణవ్, కుమార్ మంగళం బిర్లా ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్న సంగతి ఇతమిద్దంగా తెలియరాలేదు. సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగాన్ని ఆదుకోవడానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించేందుకు టెలికం శాఖ (డీవోటీ), ఆర్థిక శాఖ రంగం సిద్ధం చేసిన టైంలో వారు సమావేశం కావడమే కీలకం.

టెలికం రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడానికి కొన్ని నెలల టైం పడుతుందని తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే గానీ, ఆలస్యంగా గానీ ప్యాకేజీ ప్రకటన వస్తుందని అధికార వర్గాలను ఉటంకిస్తూ.. ఓ ఆంగ్ల దినపత్రిక వార్త కథనం ప్రచురించింది.
ఇదీ టెలికం సంస్థల పరిస్థితి
అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సంస్థలు బకాయి పడిన సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) చెల్లింపుల గడువును 20 ఏండ్లకు పొడిగించేందుకు అవసరమైన మెకానిజాన్ని కేంద్రం సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. దీనిపై న్యాయశాఖ అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది.

ఇలా ఉద్దీపన ప్యాకేజీ
లైసెన్స్ ఫీజు తగ్గించడంతోపాటు వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రం బకాయిల చెల్లింపులపై మారటోరియం మరో రెండేండ్లు పొడిగించేందుకు టెలికం శాఖ సిద్ధమైంది. ప్రత్యేకించి పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియాకు లైఫ్ లైన్ ఇవ్వడానికి రిలీఫ్ ప్యాకేజీ సిద్ధం చేసిందని సమాచారం. తద్వారా కొత్తగా ఇన్వెస్టర్ల నుంచి వొడాఫోన్ ఐడియా నిధుల సేకరణకు వెసులుబాటు కలుగుతుందని అంచనా.
దయనీయం వొడాఫోన్ ఐడియా పరిస్థితి
జూన్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి వొడాఫోన్ ఐడియా వద్ద కేవలం రూ.920 కోట్ల నగదు మాత్రమే ఉంది. సంస్థ రుణాలు రూ.1.92 లక్షల కోట్లు. ఇందులో స్పెక్ట్రం వేలం, ఏజీఆర్ బకాయి చెల్లింపులు ఉన్నాయి. గతేడాది రూ.25 వేల కోట్ల నిధులను సేకరించడానికి వొడాఫోన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో నిరాశా నిస్పృహల మధ్య వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి కుమార్ మంగళం బిర్లా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన వాటాను కూడా విక్రయించడానికి సిద్ధమని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Pawan : పవన్ బర్త్ డే: క్రేజీ అప్డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు టీం
భీకర వానలతో న్యూయార్క్ అస్తవ్యస్తం..
wireless charging room | గాలితోనే మీ ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు.. ఎలా?
Instagram Down : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. సర్వర్ డౌన్.. పనిచేయని యాప్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

