హైదరాబాద్, జనవరి 10: కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి టర్మ్ విత్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూనిట్-లింక్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో వార్షిక ప్రీమియం కంటే వంద రెట్ల వరకు లైఫ్ కవరేజ్‌తోపాటు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్) రాబడిని పొందే అవకాశాన్ని కస్టమర్లకు కల్పించింది. తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణించిన వారికి కూడా వర్తించనున్నది. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చును.