Kia EV6 | 1138 ఈవీ6 కార్లను రీకాల్ చేస్తున్న కియా.. కారణమిదేనా..?!
Kia EV6 | ఇంటిగ్రేటెడ్ చార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)లో సమస్య తలెత్తడంతో కియా తన ఈవీ ఎస్ యూవీ కారు ‘ఈవీ6’ 1138 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.
Kia EV6 | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా (Kia India) తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ‘ఈవీ6 (EV6)’ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2022 మార్చి మూడో తేదీ నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారు చేసిన 1,138 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఇంటిగ్రేటెడ్ చార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)లో సమస్య తలెత్తడంతో ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. 12-ఓల్ట్ యాక్సిలరీ బ్యాటరీతో చార్జింగ్ వల్ల ‘ఐసీసీయూ’లో సమస్య తలెత్తుతున్నదని తేలిందని పేర్కొంది. 12 ఓల్ట్ యాక్సిలరీ బ్యాటరీతో సరిగ్గా చార్జింగ్ చేస్తున్నప్పుడు ఐసీసీయూలో సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఒక ఎలక్ట్రిక్ ఈవీలో లైట్స్, మ్యూజిక్ సిస్టమ్, కారులో స్టార్ట్ అండ్ స్టాప్ పని చేయడానికి బ్యాటరీ చాలా కీలకం అని కియా ఇండియా తెలిపింది. ఒకవేళ ఐసీసీయూ యూనిట్ ఫెయిల్ అయితే, డ్రైవింగ్ సమయంలో విద్యుత్ అందకపోగా, సేఫ్టీ రిస్క్ తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈవీ6’ కారులో 12-వోల్టుల యాక్సిలరీ బ్యాటరీ పలు కీలక వ్యవస్థలకు మద్దతుగా ఉంటుంది. ఒకవేళ ఐసీసీయూ సరిగ్గా పని చేయకుంటే ఈ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా డ్రైవింగ్ సమయంలో విద్యుత్ అందక ప్రమాదకర పరిస్థితులు తలెత్తే చాన్స్ ఉందని తెలిపింది.
ఈ సమస్య పరిష్కారానికి నేరుగా సమస్య తలెత్తిన కస్టమర్లతో సంప్రదిస్తామని కియా ఇండియా వివరించింది. ఆ వాహనాల్లో ఐసీసీయూ యూనిట్, 12 ఓల్ట్ యాక్సిలరీ బ్యాటరీలో లోపాలను సరి చేస్తుందని తెలిపింది. యాక్సిలరీ బ్యాటరీ సరిగ్గా చార్జింగ్ అయ్యేందుకు ఉచితంగా ఐసీసీయూ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. ఈవీ6 వాహనాల యజమానులు తమ సమీప కియా సర్వీసు కేంద్రాలకు వెళ్లి సంప్రదించాలని కూడా సూచించింది. తమ కస్టమర్ కేర్ కేంద్రం కూడా కార్ల యజమానులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- ICCU
- kia ev6
- recall
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

