న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా..ఈ ఏడాదికిగాను దేశీయ మార్కెట్లోకి నయా సైరోస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.8.39 లక్షలుగా నిర్ణయించింది.
ప్రీమియం ఫీచర్లతోపాటు ఫైవ్ స్టార్ బీఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్, డిజైనింగ్, ఆటోమేషన్ ఆప్షన్, నూతన డీజిల్ ఆటోమేటిక్ రకం, 76.2 సెంటీమీటర్ల ట్రినిటీ పానోరమిక్ డిస్ప్లే ప్యానెల్, కార్ నావిగేషన్ కాక్‌పిట్, డ్యూయల్-ప్యానల్ పానోరమిక్ సన్‌రూఫ్, స్ట్రీమ్‌లైన్ డోర్ హ్యాండిల్, ఫ్రంట్ అండ్ రియర్ వెంటిలేటెడ్ సీట్లు, 20కి పైగా హై-స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్‌తో సంస్థ ఈ కారును తీర్చిదిద్దింది.