Jio Smart Home | ఎంటర్టైన్మెంట్కి ఓన్లీ ఆప్షన్.. జియో స్మార్ట్ హోం సర్వీసెస్..!
Jio Smart Home | రిలయన్స్ జియో.. తన యూజర్లకు రోజురోజుకి సరికొత్త సేవలు అందుబాటులోకి తెస్తున్నది. తాజాగా జియో ఎయిర్ ఫైబర్ తోపాటు జియో స్మార్ట్ హోం సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు.
Jio Smart Home | రిలయన్స్ జియో అంటేనే సంచలనం.. ఏడేండ్లుగా ప్రతిఏటా ఏదో ఒక ప్రత్యేక సర్వీసులను యూజర్లకు అందిస్తూ వారికి మరింత చేరువ అవుతోంది రిలయన్స్ జియో.. ఈ ఏడాది సరికొత్తగా మరో సర్వీస్ అందుబాటులోకి తెస్తున్నది. జియో స్మార్ట్ హోం సర్వీసెస్ (Jio Smart Home Services) ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. గూగుల్, ఆపిల్ తరహాలో టెక్ సేవల్లో ఇతర సంస్థలతో పోటీ పడుతున్న జియో.. బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ కోసం జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్ ప్రారంభిస్తోంది. దీంతోపాటు తెస్తున్నదే జియో స్మార్ట్ హోం సర్వీస్.
జియో స్మార్ట్ హోం డివైజ్‌లో ఎంటర్టైన్మెంట్ కోసం సెట్-టాప్ బాక్స్, స్మార్ట్ హోం యాప్ ఉంటాయి. 5జీ టెక్నాలజీ సాయంతో జియో ఎయిర్ ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించనుండగా.. జియో స్మార్ట్ హోం సర్వీసెస్.. ‘ఇండియన్ హోం ఎక్స్పీరియన్స్’ ను పునర్నిర్వచిస్తుందన్నారు ఆకాశ్ అంబానీ. హోం మేనేజ్మెంట్, లివింగ్ ఎక్స్ పీరియన్స్‌లో జియో స్మార్ట్ హోమ్ సర్వీస్ విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు.
న్యూ జియో సెట్-టాప్ బాక్స్ తో వినోద ప్రపంచాన్ని ఇంట్లో అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల టీవీ చానెళ్లు, స్ట్రీమింగ్ కంటెంట్, గేమింగ్, డిజిటల్ అప్లికేషన్స్ అన్నీ వీక్షించొచ్చు. జియో సినిమా, జియో టీవీ + వంటి అన్ని వినోదాత్మక కార్యక్రమాలు వీక్షించవచ్చు. ఈ సేవలన్నీ స్మార్ట్ హోం యాప్‌తో మానిటరింగ్ చేయొచ్చు. 80 శాతానికి పైగా డేటా వినియోగం ఇండ్లోనే సాగుతుందని ఆకాశ్ అంబానీ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

