Jio Platforms | రిలయన్స్ నుంచి కృత్రిమ మేధ ఆధారిత సూపర్ కంప్యూటర్.. ఎన్విదియాతో జియో ప్లాట్ ఫామ్స్ జట్టు
Jio Platforms | జియో ప్లాట్ ఫామ్స్ తో కలిసి భారత్ లో ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటర్ ఆవిష్కరిస్తామని యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న ఎన్విదిత కంపెనీ తెలిపింది.
Jio Platforms | భారతీయులకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం రిలయన్స్ అనుబంధ జియో ఫ్లాట్‌ఫామ్స్ (Jio Platforms), ప్రపంచ అగ్రశ్రేణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intellegence) సంస్థ- ఎన్విదియా (Nvidia) (యూఎస్)తో జత కట్టింది. రెండు సంస్థలు కలిసి భారత్‌లో అంతర్జాతీయ స్థాయి క్లౌడ్ బేస్డ్ కృత్రిమ మేధ (Artificial Intellegence) (ఏఐ) కంప్యూటర్ మౌలిక వసతులను కల్పించడానికి ఎన్విదియాతో కలిసి పని చేస్తున్నట్లు జియో ప్లాట్ ఫామ్స్ శుక్రవారం ప్రకటించింది.
‘రీసెర్చర్లు, డెవలపర్లు, స్టార్టప్‌లు, శాస్త్రవేత్తలు, ఏఐ ప్రాక్టీషనర్లు తదితరులకు హైస్పీడ్ సురక్షిత క్లౌడ్ నెట్‌వర్కింగ్‌ను న్యూ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తెస్తుంది. ఇంధన పొదుపుతోపాటు సేఫ్టీగా వర్క్ లోడ్స్ నిర్వహించేందుకు దోహదపడతాయి` అని జియో ప్లాట్‌ఫామ్స్ తెలిపింది. దీని సాయంతో 45 కోట్ల మంది జియో మొబైల్ సబ్స్క్రైబర్లకు ఏఐ అప్లికేషన్లు, సర్వీసులు క్రియేట్ చేస్తుంది.
జియో ప్లాట్‌ఫామ్స్‌తో భారత్‌లో ఏఐ మౌలిక వసతులు నిర్మిస్తామని ఎన్విదియా వేరొక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న దాని కంటే శక్తిమంతమైన ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ (Super Computer) తయారు చేస్తామని పేర్కొంది. అత్యంత ఆధునిక ఎన్విదియా Nviddia జీహెచ్200 గ్రేస్ హుపర్ సూపర్ చిప్, ఎన్విదియా డీజీఎక్స్ క్లౌడ్, క్లౌడ్‌లో సూపర్ కంప్యూటింగ్ సర్వీస్ పొందొచ్చు. రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యం పొందినందుకు గర్వంగా ఉందని ఎన్విదియా సీఈఓ కం ఫౌండర్ జెన్సన్ హాంగ్ తెలిపారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీతో జెన్సన్ హాంగ్ సమావేశమయ్యారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

