Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Jio IPO : జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవోకు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఐపీవో ప్రారంభం అయిన నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రిప్షన్ పూర్తైంది.
Jio IPO : జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవోకు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఐపీవో ప్రారంభం అయిన నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రిప్షన్ పూర్తైంది. దాదాపు 100 నిమిషాల్లోనే వంద శాతం సబ్‌స్క్రైబ్ అయింది. అది కూడా 1.65 రెట్లు. ఇక సంస్థ ఉద్యోగుల కోసం కేటాయించిన ఎంప్లాయ్ కోటా కూడా మొదటి రోజే పూర్తిగా వందశాతం సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకుంది.
ఇదే సమయంలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) కూడా మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ పూర్తైంది. ఎన్ఎస్ఈ డాటా ప్రకారం క్యూఐబీ 3.77 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం 30 శాతం కోటా కేటాయించగా సబ్స్క్రిప్షన్ పూర్తైంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన 27 శాతం కోటా సబ్స్క్రిప్షన్ పూర్తైంది. 19,75,25,934 షేర్లకుగాను 23,27,13,888 బిడ్లు దాఖలయ్యాయి. మెగా ఐపీవోల్లో అత్యంత వేగంగా సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న ఇష్యూగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది. ఇంతకుముందు ఇలాంటి మెగా ఐపీవోల్లో బజాజ్ ఫైనాన్స్ మొదటి రోజు మధ్యాహ్నం 2.00 గంటల వరకు సబ్స్క్రిప్షన్ పూర్తైంది.
ఆ తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాలో తొలిరోజు పూర్తయ్యే సరికి సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకుంది. ఈ రోజు మొదలైన జియో ఐపీవో గడువు అక్టోబర్ 23 వరకు ఉంది. దీని ద్వారా రూ.30,213 కోట్లు సమీకరించుకోవాలి అనుకుంది. ఇంతకుముందు అతిపెద్ద మెగా ఐపీవో హ్యూండాయ్ మోటార్ ఇండియా సంస్థ 2024లో రూ. 27,870 కోట్లు సమీకరించింది. జియో ప్లాట్పామ్స్ మెగా ఐపీవోపై సంస్థ ఎండీ ఆకాశ్ అంబానీ స్పందించారు. ఈ రోజు జియో ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోందని ఆయన అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- GMP
- Jio IPO
- jio platforms
- QIB
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

