Jio Laptop | చౌకధరలో జియో న్యూ ల్యాప్‌టాప్.. స్పెషిపికేషన్స్ ఇవే..!
Jio Laptop | టెలికం సంచలనం.. చౌక ధరలో డేటా.. అటుపై ఫోన్లు తీసుకొచ్చిన జియో.. తాజాగా జియోబుక్ పేరుతో ల్యాప్‌టాప్ తెస్తోంది.

Jio Laptop | జియోఫోన్ నెక్ట్స్ అనే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన రిలయన్స్ జియో తాజాగా ల్యాప్‌టాప్.. జియోబుక్ అనే పేరిట విపణిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఓ చైనా కంపెనీ సహకారంతో రూపుదిద్దుకుంటున్న జియోబుక్.. ల్యాప్‌టాప్ ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 2జీ రామ్, మీడియాటెక్ ఎంటీ8788 ఎస్వోసీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్-11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుందిది. 4జీ ఎల్టీఈ మద్దతుతో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌లో జియో యాప్స్ అన్నీ ముందస్తుగానే ఇన్స్టాల్ చేస్తారు.
మూడు వేరియంట్లలో జియో ల్యాపీ
ఇంజినీరింగ్ విద్యార్థులకు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఐటీ నిపుణులకు, వివిధ కార్యాలయాల్లో సేవలందిస్తున్న ప్రొఫెషనల్స్‌కు జియోబుక్ కం జియో ల్యాప్‌టాప్.. దాదాపు రెండు నెలల క్రితమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్సైట్లో ప్రత్యక్షమైంది. బీఐఎస్ వర్గాల కథనం ప్రకారం జియోబుక్.. మూడు వేరియంట్లలో లభ్యం కానున్నది. అంతేకాదు ఇది ఆండ్రాయిడ్ మద్దతుతో జియో-ఓఎస్ మీద పని చేస్తుంది. జియోబుక్ స్పెషికేషన్స్ పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. దీనికి విండోస్ కీ (Windows key) ఉంటుందని, కానీ విండోస్‌పై పని చేయడం సాధ్యం కాకపోవచ్చంటున్నారు.
2008లో ప్రకటన.. 2020 సెప్టెంబర్‌లో షురూ..
త్వరలో మార్కెట్లోకి ప్రవేశించనున్న ఈ ల్యాప్‌టాప్ ధర వెల్లడించకున్నా.. జియో ఫోన్, జియో పోన్ 1, జియో ఫోన్ నెక్ట్స్ మాదిరిగానే బడ్జెట్ ధరలోనే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం జియో ల్యాప్‌టాప్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్నారని తెలుస్తోంది. ఇది గీక్‌బెంచ్‌పై కూడా కనిపిస్తుంది. 2008లోనే ల్యాప్‌టాప్ సెగ్మెంట్‌పై పని చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.
ఇవీ జియో ల్యాపీ స్పెషిఫికేషన్స్..
మాక్ ఓఎస్ ఎక్స్, విండోస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ కంప్యూటర్‌కు క్రాస్-ప్లాట్‌ఫామ్ యుటిలిటీయే గీక్‌బెంచ్. జియోబుక్ 1366x 768 పిక్సెల్ రిజొల్యూసన్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ ఎక్స్ 12 4జీ మోడెంతోపాటు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ తదితర స్పెసిఫికేషన్స్ దీని స్పెషాలిటీ. ఇది ఎన్బీ1118క్యూఎండబ్ల్యూ, ఎన్బీ 1148క్యూఎండబ్ల్యూ, ఎన్బీ 1112ఎంఎం వేరియంట్లలో జియో బుక్ వస్తోంది.
కనెక్టివిటీ ఆప్షన్స్ ఇవీ
32 జీబీ స్టోరేజీతో 2జీబీ ర్యామ్ కెపాసిటీ, 64 జీబీ స్టోరేజీతో 4జీబీ ర్యామ్ మోడల్ ల్యాప్ ట్యాప్స్ రానున్నాయి. బ్లూటూత్, డ్యుయల్ బాండ్ వై-పై, మినీ హెచ్డీఎంఐ కనెక్టర్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. జియో స్టోర్, జియోమీట్, జియో పేజేఎస్ వంటి జియో యాప్స్ ముందస్తుగానే జియోబుక్‌లో ఇన్స్టాల్ చేస్తారు. 3-యాక్సిస్ ఏస్సెలెరోమీటర్,క్వాల్కామ్ ఆడియో చిప్ కూడా ఇందులో ఉంటుంది. టీమ్స్, ఎడ్జ్, ఆఫీస్ వంటి మైక్రోసాఫ్ట్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు.
ఈ చైనా కంపెనీతోనే జియో టైఅప్
ఇప్పటికే జియోఫోన్ నెక్ట్స్ ఉత్పత్తి చేస్తున్న చైనా మాన్యుఫాక్చరర్ బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థతో జియో బుక్ ఉత్పత్తి కోసం రిలయన్స్ జియో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. గతేడాది సెప్టెంబర్ నుంచే జియో బుక్ కం జియో ల్యాప్‌టాప్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పూర్తిగా ల్యాప్‌టాప్ సిద్ధమయ్యాక ఇమేజ్ను జియో ఆవిష్కరించే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Bhagyasree Daughter | జూనియర్ భాగ్యశ్రీ ఎంట్రీకి లైన్‌క్లియర్..!
SBI Alert | ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. అదేమిటంటే?!
5G Auction | ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రం వేలం.. ట్రాయ్లోనూ మార్పులు!
క్రిప్టోకరెన్సీలతో ఆర్ధిక వ్యవస్ధకు ముప్పు : ఆర్బీఐ గవర్నర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jio laptop
- Mukesh Ambani
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

