Fixed Deposits | మల్టీ క్యాప్ ఫండ్స్ కన్నా.. ఫిక్స్డ్ డిపాజిట్లు బెస్ట్.. ఏడాదిలోనే 92 % ప్రాపిట్..!
Fixed Deposits | మల్టీ క్యాప్స్‌లో పెట్టుబడులు పెట్టడం కంటే ఫిక్స్డ్ డిపాజిట్లలో మదుపు చేస్తే ఏడాదిలో 92 శాతం రిటర్న్స్ ఇస్తాయి.

Fixed Deposits| మీరు మీ ఆదాయాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయాలని భావిస్తున్నారా.. మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)లో మల్టీ క్యాప్స్కీమ్స్ ఉన్నాయి. వీటికంటే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)లో మదుపు చేసిన పెట్టుబడులపై ఎక్కువ రిటర్న్స్ లభిస్తాయి. గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 92 శాతం వరకు రిటర్న్స్ అందించాయి.
అయితే, మనం ముందుగా మ్యూచువల్ ఫండ్స్‌లో విభిన్న ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అంటూ మూడు కేటగిరీలతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ మూడు ఫండ్స్‌లోనూ అవకాశాలు, రిస్క్‌లు ఉన్నాయి. సెబీ నిబంధనల ప్రకారం టాప్-100 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్..లార్జ్ క్యాప్స్ తదుపరి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఉంటుంది.
సెబీ నూతన రూల్స్ ప్రకారం మల్టీక్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో 25-25% నిధులు మూడు క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్.. లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఫండ్ మేనేజర్ అంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో కనీసం 75 శాతం ఈక్విటీ, ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి.
ఉదాహరణకు ఇన్వెస్టర్ల నుంచి రూ.100 పెట్టుబడి వచ్చిందనుకుందాం.. ఆ మొత్తం సదరు మ్యూచువల్ ఫండ్ మేనేజర్.. రూ.75 ఈక్విటీ, ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. రూ.25-25 లార్జ్, స్మాల్, మిడ్ క్యాప్స్‌లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మిగతా రూ.25 ఫండ్ మేనేజర్ తన సొంతంగా పెట్టుబడులు పెట్టాలి.
కనుక ఫండ్ మేనేజర్లు తమ పథకాల్లో మదుపు చేసిన మొత్తాన్ని రిస్క్ తక్కువ ఉన్న ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్చేస్తారు. మీరు ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినా హై రిస్క్ తలెత్తొద్దని భావిస్తే టాప్రేటెడ్ మల్టీ క్యాప్ ఫండ్స్‌లోనే మదుపు చేయాల్సి ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో మల్టీ క్యాఫ్ ఫండ్స్ వైవిధ్య భరితం, విభిన్నం. అయితే మార్కెట్ స్థిరంగా కొనసాగుతున్నప్పుడు స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో కంటే మల్టీ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులపై తక్కువ రిటర్న్స్ వస్తాయి. కానీ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు రిస్క్ తక్కువగా ఉంటుంది. మల్టీ క్యాప్ ఫండ్స్‌లో మదుపు వల్ల మోస్తరు రిస్క్ ఉంటుంది. కనుక మీరు సరైన ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఎంచుకోవడం బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- mutual funds
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

