SBI Alert | ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. అదేమిటంటే?!
SBI Alert | సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని ఎస్బీఐ తన ఖాతా దారులకు అలర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

SBI Alert | కేవైసీ మోసాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. ఇటీవల ఆన్లైన్లో ఎక్కువ మోసాలు జరుగుతుండటం. వారిలో ఎస్బీఐ ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతుండటంతో బ్యాంకు పై విధంగా హెచ్చరికలు జారీ చేసింది. కేవైసీ ధృవీకరణ పేరిట సైబర్ మోసగాళ్లు తమ కస్టమర్లకు వల విసురుతున్నారని పేర్కొంది. కనుక తమ ఖాతాదారులు బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పింది.
ఎస్బీఐ పేరిట ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే కేవైసీ అప్డేట్ లింక్స్ తెరవొద్దని హెచ్చరిస్తున్నాం. ఈ మోసాలపై http://cybercrime.gov.in అనే పోర్టల్‌కు ఫిర్యాదు చేయండంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని పేర్కొంది. ఖాతాదారుల మొబైల్ నంబర్, ఖాతా వివరాలు, డెబిట్ కార్డ్ నంబర్, పిన్, ఓటీపీ తదితర సున్నిత వివరాలను ఎవరితోనూ చెప్పవద్దని స్పష్టం చేసింది. ఇటువంటి ఎస్సెమ్మెస్ మోసాల బారిన పడి మోసపోవద్దని ఖాతాదారులను హెచ్చరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Cyber Crime
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

