Jio Bharat B1 4G | యూపీఐ పేమెంట్స్ కు వీలుగా జియో భారత్ బీ1 ఫోన్.. ఇవీ డిటైల్స్..!
Jio Bharat B1 4G | రిలయన్స్ జియో కొత్తగా ‘జియో భారత్ బీ1` పేరుతో మరో ఫీచర్ ఫోన్ తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుగా ఇన్ బిల్ట్ జియో పే యాప్ ఇన్ స్టాల్ చేశారు.
Jio Bharat B1 4G | రిలయన్స్ జియో (Reliance Jio) తన జియో భారత్ (Jio Bharat) సిరీస్లో 4జీ ఫీచర్ ఫోన్ జియో భారత్ బీ1 (Jio Bharat B1) మార్కెట్లో ఆవిష్కరించింది. జియో వీ2, జియో కే2 కార్బన్ ఫోన్ల తరహాలోనే జియో భారత్ బీ1 ఫోన్ ఆవిష్కరించింది. వేర్వేరు సిరీస్లతో జియో భారత్ బీ1 ఫోన్ తన జియో అధికారిక వెబ్ సైట్లో లిస్ట్ చేసింది. కొత్త జియో భారత్ బీ1 ఫోన్ మాత్రం పలు ప్రాంతీయ భాషల్లో, ముందస్తుగా ఇన్ స్టాల్ చేసిన పలు జియో యాప్లతో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఇన్ బిల్ట్ ‘జియోపే’ యాప్ ఇన్ స్టాల్ చేసి ఉంటుంది.
జియో భారత్ బీ1 4జీ ఫోన్ రూ.1,299లకే లభిస్తుంది. జియో అధికారిక వెబ్ సైట్ తోపాటు ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ లోనూ లభిస్తుంది. బ్లాక్ కలర్ ఆప్షన్ లోనే అందుబాటులో ఉంటుంది. మరోవైపు జియో భారత్ వీ2, జియో భారత్ కే2 కార్బన్ ఫోన్లు రూ.999లకే లభిస్తాయి.
జియో భారత్ బీ1 ఫోన్ 2.4 అంగుళాల క్యూవీజీఏ రెక్టాంగులర్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. థ్రెడ్ ఎక్స్ ఆర్టీవోస్, 0.5 జీబీ ర్యామ్ తో వస్తున్నదీ ఫోన్. బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 4జీ కనెక్టివిటీ గల ఈ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీని మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో కెపాసిటీ 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. 2000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ పూర్తిస్థాయిలో చార్జింగ్ చేస్తే 343 గంటల వరకూ బ్యాటరీ లైఫ్ స్టాండ్ బైగా ఉంటుంది. జియో భారత్ బీ1 ఫోన్ సైతం అన్ స్పెసిఫైడ్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కలిగి ఉంటుంది. 23 భాషలకు జియో భారత్ బీ1 ఫోన్ మద్దతుగా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

