ఐ-పేస్ ఈవీతో జాగ్వార్ గర్జన

- ప్రారంభ ధర రూ.1.06 కోట్లు
న్యూఢిల్లీ, మార్చి 23: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తనదైన శైలిలో గర్జించింది. 2025 సంవత్సరం నాటికి విద్యుత్‌తో నడిచే కార్లను మాత్రమే తయారుచేసే బ్రాండ్‌గా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కంపెనీ తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘జాగ్వార్ ఐ-పేస్’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కేవలం 4.8 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారు ప్రారంభ ధరను రూ.1.06 కోట్లుగా నిర్ణయించింది. 90 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉండే జాగ్వార్ ఐ-పేస్.. 294 కిలోవాట్ల శక్తిని, 696 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. జాగ్వార్ ఐ-పేస్ కొనుగోలుదార్లకు కారుతో పాటు చార్జింగ్ కేబుల్‌ను, 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్-మౌంటెడ్ చార్జర్‌ను అందజేయనున్నట్లు జేఎల్ఆర్ తెలిపింది.
స్వాగతించిన బెంజ్
ఇదిలావుంటే, వ్యాపారంలో జేఎల్ఆర్కు ప్రధాన పోటీదారుల్లో ఒకటైన మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ.. మార్కెట్లోకి జాగ్వార్ ఐ-పేస్ రాకను స్వాగతించింది. అంతేకాకుండా మెర్సిడెజ్ బెంజ్ చార్జింగ్ స్టేషన్లలో జాగ్వార్ ఐ-పేస్ కార్లను చార్జింగ్ చేసుకునేందుకు వాటి యజమానులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ ప్రకటనపై జేఎల్ఆర్ హర్షం వ్యక్తం చేసింది. మెర్సిడెజ్ బెంజ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

