Tata Motors Offers | టాటా మోటార్స్ ఫెస్టివ్ ఆఫర్లు.. రూ.45 వేల వరకు బెనిఫిట్!
Tata Motors Offers | హ్యాచ్‌బ్యాక్, ఎస్యూవీ కార్లపై టాటా మోటార్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. గరిష్టంగా రూ.45 వేల బెనిఫిట్ పొందొచ్చు.
Tata Motors Offers | ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ల తయారీ సంస్థలు పోటీ పడుతున్నాయి. దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సైతం అందులో ముందు వరుసలో నిలిచింది. ఎంపిక చేసిన ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్ కార్లపై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి నాటికి డిస్కౌంట్లు, ఇన్సెంటివ్‌లు రెట్టింపు అవుతాయని భావిస్తున్నారు. టాటా టియాగో, టైగోర్ సీఎన్జీ, టైగోర్, హారియర్, సఫారీ కార్లపై క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ బెనిఫిట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు అందిస్తోంది.
టైగోర్ సీఎన్జీపై రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.10 వేలు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్ ప్లస్, ఎక్స్ ఎం ట్రిమ్ కంపాక్ట్ ట్రిమ్‌ల్లో టైగోర్ సీఎన్జీ లభిస్తోంది. టైగోర్ సీఎన్జీ 1.2 లీటర్ల బీఎస్-6 సామర్థ్యం గల ఇంజిన్ గరిష్టంగా 73 పీఎస్ విద్యుత్ అందిస్తుంది. సీఎన్జీ సెగ్మెంట్లో టైగోర్ అందిస్తున్న విద్యుత్ అధికం. పెట్రోల్ వేరియంట్ మోడ్‌లో 113 ఎన్ఎంతో 86 హెచ్‌పీ విద్యుత్ అందిస్తోంది.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండో స్థానంలో టాటా హారియర్ నిలిచింది. దీనిపై ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.40 వేలు, కార్పొరేట్ బెనిఫిట్ రూ.5000 పొందొచ్చు. టాటా హారియర్ 2.0 లీటర్ల టర్బో చార్జిడ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్నది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ గల హారియర్ 140 పీఎస్ పవర్, 350 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
అన్ని టాటా సఫారీ వేరియంట్లపై ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.40 వేలు బెనిఫిట్ కల్పిస్తున్నది. టాటా సఫారీలో స్టెప్డ్ రూఫ్, రీ డిజైన్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు రీఫ్రెష్డ్ రేర్ ప్రొఫైల్, స్లీకర్ టెయిల్ గేట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
టైగోర్పై ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.10 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 బెనిఫిట్ లభిస్తుంది. టాటా టియాగోపై ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.10వేలు, క్యాష్ డిస్కౌంట్‌గా రూ.10 వేలు బెనిఫిట్ పొందవచ్చు. హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.3000 అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
Smart Phone Tips | మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

