న్యూఢిల్లీ, జూన్ 1: ఐఆర్డీఏఐ బీమా వాహక్స్ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ పంచాయతీల స్థాయిలోనే ఓ అంకితభావం కలిగిన పంపిణీ వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే పంపిణీ వ్యవస్థ కోసం వ్యక్తిగత, కార్పొరేట్ బీమా వాహకులను ప్రతిపాదించింది. బీమా కంపెనీలో నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా నియమితులయ్యేవారే కార్పొరేట్ బీమా వాహకులు.
ఇక వ్యక్తిగత బీమా వాహకులను అటు బీమా సంస్థగానీ లేదంటే కార్పొరేట్ బీమా వాహకులైనా వ్యక్తిగతంగా నియమించుకోవచ్చు. కాగా, ఈ కార్పొరేట్, వ్యక్తిగత బీమా వాహకులిరువురు ప్రపోజల్ ఇన్ఫర్మేషన్ను సేకరించడం, కేవైసీ డాక్యుమెంట్లను సమీకరించడం, క్లెయిమ్ సంబంధిత సేవల సమన్వయం వంటివి చూస్తారు.