iQoo Z9 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ ఐక్యూ తన ఐక్యూ జడ్9 5జీ ఫోన్ (iQoo Z9 5G) వచ్చేనెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నది. ఈ సంగతి ఐక్యూ ఇండియా సీఈఓ నిపుణ్ మార్య తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్, ఐక్యూ ఇండియా వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్ విక్రయిస్తారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. గతేడాది ఆవిష్కరించిన ఐక్యూ జడ్7 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా ఐక్యూ జడ్9 5జీ ఫోన్ వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. దీని ధర రూ.25,000 పలుకుతుందని భావిస్తున్నారు. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని తెలుస్తున్నది.