iQoo Z9 5G | 12న ఐక్యూ జడ్9 5జీ ఫోన్ లాంచింగ్.. ఇవీ డిటైల్స్..!
iQoo Z9 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ తన ఐక్యూ జడ్9 5జీ ఫోన్‌ను ఈ నెల 12న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
iQoo Z9 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9 5జీ (iQoo Z9 5G) ఫోన్‌ను ఈ నెల 12న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో అమోలెడ్ డిస్ ప్లే, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుందని టీజర్ వచ్చింది. బ్రష్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో వస్తుందని భావిస్తున్నారు. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా ఉంటుంది.
గతేడాది దేశీయ మార్చిలో మార్కెట్లో ఆవిష్కరించిన ఐక్యూ జడ్7 5జీ ఫోన్ కొనసాగింపుగా ఐక్యూ జడ్9 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నది. ఐక్యూ జడ్7 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999 పలుకుతుంది. ఐక్యూ జడ్7 5జీ పోన్ 6.38 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. గతేడాది సెప్టెంబర్‌లో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఐక్యూ జడ్8 ఫోన్.. ఇంకా భారత్ మార్కెట్లో రిలీజ్ చేయలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

