IPO | త్రీవ ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. అయినా ఐపీవోలు సూపర్ హిట్
ఇది ఐపీవోల కాలం. ఒకవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ..మరోవైపు లిస్ట్ కావాలని చూస్తున్న సంస్థలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ వారంలో అరడజన్కు పైగా సంస్థలు ఐపీవోకి రాబోతున్నాయి. వీటిలో మూడు సంస్థల వాటా విక్రయానికి అపూర్వ స్పందన లభించింది.
IPO | న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఇది ఐపీవోల కాలం. ఒకవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ..మరోవైపు లిస్ట్ కావాలని చూస్తున్న సంస్థలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ వారంలో అరడజన్కు పైగా సంస్థలు ఐపీవోకి రాబోతున్నాయి. వీటిలో మూడు సంస్థల వాటా విక్రయానికి అపూర్వ స్పందన లభించింది. సంస్థలు జారీ చేసిన షేర్ల కంటే ఎన్నో రెట్ల అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. వీటి వివరాలు..
క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్
- సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 51.85 రెట్ల అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి.
- ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడిదారులు అధికంగా కొనుగోళ్లు జరిపారు
- రూ.549.77 కోట్ల నిధుల సేకరణ కోసం 1,37,44,472 షేర్లను జారీ చేయగా 71,26,92,325 షేర్ల బిడ్డింగ్‌లు వచ్చాయి.
- ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన 1.96 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నది.
- షేరు ధరల శ్రేణి రూ.266-280 స్థాయిలో నిర్ణయించింది.
- సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 1,807 టచ్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో 404 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్లు కాగా 71 అతిపెద్ద స్టోర్లు, 1,332 మల్టీ-బ్రాండ్ అవుట్లెట్లు ఉన్నాయి.
- కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నాయి.
ఆర్బీజెడ్ జ్యూవెల్లర్స్
- జారీ చేసిన 79 లక్షల షేర్లకు 13,31,88,450 షేర్ల బిడ్డింగ్‌లు వచ్చాయి. జారీ చేసిన దాని కంటే 16.86 రెట్లు అధికంగా వచ్చాయి.
- రిటైల్ ఇండివీడ్యువల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్ల కంటే 24.74 రెట్ల అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. అలాగే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్లకు 13.43 రెట్లు, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల 9.27 రెట్లు అధికంగా వచ్చాయి.
- రూ.95-100 ధరల శ్రేణిలో కోటి ఈక్విటీ షేర్లను జారీ చేసింది.
- కంపెనీ ఈక్విటీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్‌కానున్నాయి.
హ్యాప్పీ ఫోర్జింగ్స్
- ఆటో విడిభాగాల తయారీ సంస్థ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది.
- రూ.1,008 కోట్ల నిధులు సేకరణకు సంబంధించి 83,65,639 షేర్లను జారీచేసింది.
- ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో 68,62,98,398 షేర్లకు బిడ్డింగ్‌లు వచ్చాయి. అంటే 82.04 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు వచ్చాయి.
- షేరు ధరల శ్రేణి రూ.808-850 స్థాయిలో నిర్ణయించింది.
- ఆటో విడిభాగాల సంస్థ హ్యాప్పీ ఫోర్జింగ్..బ్రెజిల్, ఇటలీ, జపాన్, స్పెయిన్, స్వీడన్, థాయిలాండ్, టర్కీ, బ్రిటన్, అమెరికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

