iPhone 15 | ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఇవీ డిటైల్స్ ..!
iPhone 15 | ఆపిల్ ‘ఐ-ఫోన్15’ సిరీస్ ఫోన్లు వచ్చేనెల 12న ఆవిష్కరించనున్నది. వీటితోపాటు రెండు న్యూ స్మార్ట్ వాచీలు ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది.
iPhone 15 |గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. ఐ-ఫోన్-15 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 12న ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లతోపాటు ఆపిల్ వాచ్ సిరీస్9, ఆపిల్ వాచ్ ఆల్ట్రా2, ఐఓఎస్ 17, వాచ్ ఓఎస్ 10 కూడా ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. కాలిఫోర్నియాలోని ‘ఆపిల్ పార్క్’లో సెప్టెంబర్ 12 ఉదయం 10 గంటలకు (భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి ‘వండర్ లస్ట్ (Wonderlust)’ అనే పేరు ఖరారు చేశారు. ఆన్లైన్లో ఆపిల్ డాట్ కామ్ ( apple.com), ఆపిల్ టీవీ యాప్ (Apple TV app) లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది.
ఐఫోన్ (iPhone 15) సిరీస్‌లో ఐ-ఫోన్ (iPhone 15), ఐ-ఫోన్15 ప్లస్ (iPhone 15 Plus), ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్లు ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. చార్జింగ్ కోసం లైటెనింగ్ పోర్ట్ స్థానే యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఇస్తారని తెలుస్తున్నది.
ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లతోపాటు రెండు న్యూ స్మార్ట్ వాచీలు కూడా ఆపిల్ ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. వాటిల్లో ఆపిల్ వాచ్ సిరీస్9, ఆపిల్ వాచ్ ఆల్ట్రా2 ఉన్నాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 9 – ఐదు కలర్స్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. ఇక ఆపిల్ వాచ్ ఆల్ట్రా 2 మోడల్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేస్తారని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

