iPhone 14 Discount | ఐ-ఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. 15 అర్థరాత్రి నుంచి షురూ..!
iPhone 14 Discount | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో భాగంగా ఐఫోన్-14పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై రాయితీ కూడా ఇందులో కలిపారు.
iPhone 14 Discount | ఆపిల్ ఐ-ఫోన్ అంటే ఎవరికైనా మక్కువే. గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లో రిలీజ్ చేసిన ఐ-ఫోన్14 (iPhone 14) పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి రాబోతున్నది. ఈ నెల 15,16 తేదీల్లో వచ్చే అమెజాన్ ప్రైమ్ డే-2023 సేల్స్‌లో భాగంగా ఐ-ఫోన్14పై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నెల 15 అర్థరాత్రి నుంచి 16వ తేదీ అర్థరాత్రి వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జరుగుతాయి.
అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్‌లో భాగంగా ఆపిల్ ఐ-ఫోన్ 14 (iPhone 14) రూ.66,499లకే లభిస్తుంది. వాస్తవంగా 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ వేరియంట్ ఐ-ఫోన్ 14 (iPhone 14) ధర రూ.79,900. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో భాగంగా డిస్కౌంట్ ధరపై అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ కూడా ఇందులో కలిపి డిస్కౌంట్ ఖరారు చేశారు.
ఆపిల్ ఐఫోన్14 (iPhone 14) ఏ15 బయోనిక్ చిప్‌తో అందుబాటులోకి వచ్చింది. 2021లో మార్కెట్లోకి వచ్చిన ఐ-ఫోన్ 13, ఐ-ఫోన్ 13 ప్రో మోడల్స్ లోనూ ఇదే బయోనిక్ చిప్ వినియోగించారు. ఐ-ఫోన్ 14 (iPhone 14) 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్ ప్లేతోపాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, డోల్బీ విజన్ సపోర్ట్, సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
ఐ-ఫోన్14 (iPhone 14)లో 12-మెగా పిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్స్ ట్రూ డెప్త్ కెమెరా లభిస్తాయి.ఆపిల్ తన ఐఫోన్లలో ఫేస్ ఐడీ టెక్నాలజీ వినియోగిస్తుంది. 2017లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ ఎక్స్‌తో ఫేస్ ఐడీ టెక్నాలజీ వాడకం ప్రారంభమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

