హాట్ డీల్ : రూ . 50,000లోపే ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు..ఎలాగంటే..!
విజయ్ సేల్స్ యాపిల్ ప్రోడక్ట్స్‌పై స్పెషల్ సేల్‌తో ముందుకొచ్చింది. డిసెంబర్ 31 వరకూ కొనసాగే ఈ స్పెషల్ సేల్‌లో యాపిల్ ప్రోడక్ట్స్‌పై రిటైల్ స్టోర్ భారీ ఆఫర్లు, హాట్ డీల్స్‌ను అందిస్తోంది.
న్యూఢిల్లీ : విజయ్ సేల్స్ యాపిల్ ప్రోడక్ట్స్‌పై స్పెషల్ సేల్‌తో ముందుకొచ్చింది. డిసెంబర్ 31 వరకూ కొనసాగే ఈ స్పెషల్ సేల్‌లో యాపిల్ ప్రోడక్ట్స్‌పై రిటైల్ స్టోర్ భారీ ఆఫర్లు, హాట్ డీల్స్‌ను అందిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై యాపిల్ ఐఫోన్ 13ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే సరైన అవకాశమని కంపెనీ పేర్కొంది.
ఐఫోన్ 13 పాత మోడల్ అయినా రూ . 60,000లోపే ఈ హాట్ డివైజ్‌ను విజయ్ సేల్స్ స్పెషల్ సేల్‌లో దక్కించుకోవచ్చు. ఏ15 చిప్‌తో కూడిన ఐఫోన్ 13 సిరీస్ ఇప్పటికీ ఇతర అండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే వేగవంతమైన పెర్ఫామెన్స్ అందిస్తోంది. రూ. 69,900 విలువైన ఐఫోన్ 13ను విజయ్ సేల్స్‌లో రూ .65,900కు ఆఫర్ చేస్తున్నారు. ఆపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ఉంటే రూ. 3000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లబిస్తుంది. దీంతోపాటు మీవద్ద ఐఫోన్ 11 ఉంటే ఐఫోన్ 13పై మీరు రూ .15,000 వరకూ తగ్గింపు పొందుతారు.
ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ అనంతరం వినియోగదారులు రూ .48,900కే ఐఫోన్ 13ను దక్కించుకోవచ్చు. ఐఫోన్ 13 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో, ఏ15 బయోనిక్ 5ఎంఎం హెక్సా కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఐఓఎస్ 15 అవుటాఫ్ది బాక్స్ ఓఎస్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఇక ఐఫోన్ 13 12 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్‌తో పాటు ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 ఎంపీ లెన్స్‌ను కలిగిఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

