బాండ్లతో ఈక్విటీల్లో ఉలికిపాటు
గత రెండు మూడు వారాలుగా ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ఈ సమయంలోనూ డాలర్ మరింత బలపడుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు దిగువకు పడిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది. సాధారణంగా బాండ్ల రాబడులు, డాలర్ విలువతో ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లకు విలోమ సంబంధం ఉంటుంది. అంటే బాండ్ రాబడులు పెరిగే కొద్దీ ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతాయి. ఈ విలోమ సంబంధానికి ప్రధానంగా సంస్థాగత పెట్టుబడులు కారణం. మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు ఎక్కడ రాబడి అక్కడే మదుపు చేసి తద్వారా అధిక లాభాలను చూపించడం పరిపాటి. ఇప్పుడు జరుగుతున్నది ఈ క్రమమే. ఈక్విటీ మార్కెట్లు గత ఏడాది కాలంలో రెట్టింపు కాగా, గత రెండేండ్లలో బంగారం రెట్టింపు అయింది. ఈ సమయంలో బాండ్లపై రాబడులు తగ్గాయి. డాలర్ ఇండెక్స్ రెండేండ్ల కనీస స్థాయికి పడిపోయింది. ఇప్పుడు బాండ్ రాబడులు పెరుగడం వల్ల ఈక్విటీల్లోనూ, బంగారంలోనూ లాభాలను స్వీకరించడానికి వాటిని అమ్మేసి, వచ్చే నిధులను బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. షేర్లలో లాభాలను స్వీకరించండి. కొత్త మదుపులో సెలక్టివ్‌గా ఎంచుకొండి. ఎస్ఐపీలను మాత్రం కొనసాగించండి. కొత్తగా బాండ్ ఫండ్లలో మదుపు చేయండి లేదా హైబ్రిడ్ ఫండ్లలో మదుపు చేయండి తద్వారా రిస్క్ తక్కువగా వుండే రాబడులను పొందవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bonds
- equities
- investment
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

