రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అవకాశాలకు కొదవే లేకపోవడంతో మదుపరులు స్వల్ప, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రియల్టీని, ముఖ్యంగా కమర్షియల్ స్పేస్‌ను ఎంచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు విస్తరిస్తుండటం మదుపరులకు కలిసొచ్చే అంశంగా వారు పేర్కొంటున్నారు. వివిధ రంగాల్లోకి కొత్త సంస్థలు భారీ పెట్టుబడులతో భాగ్యనగరంలోకి ప్రవేశిస్తున్నాయని కూడా గుర్తుచేస్తున్నారు. ఇక ఇటీవలి ఓ సర్వేలో మిల్లేనియల్స్ (1981 నుంచి 1996 మధ్య జన్మించినవారు) భారతీయ కమర్షియల్ స్పేస్‌పై అమితాసక్తిని కనబరుస్తున్నట్టు తేలింది. ముఖ్యంగా ఎన్నారైలు దేశీయ రియల్టీపై దృష్టి పెట్టినట్టు చెప్తున్నారు. కాగా, రెసిడెన్షియల్ మార్కెట్లోనూ హైదరాబాద్ హాట్‌కేక్ అని పెట్టుబడులు మంచి రాబడులను తెచ్చిపెట్టగలవని సూచిస్తున్నారు.