Infinix Hot 40i | బడ్జెట్ ధరలో ఇన్ ఫినిక్స్ హాట్ 40ఐ.. 16న భారత్ మార్కెట్లో లాంచింగ్.. ఇవీ డిటైల్స్..!
Infinix Hot 40i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ను భారత్ మార్కెట్లో ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది.
Infinix Hot 40i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ను భారత్ మార్కెట్లో ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది. గత నెలలో సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. దీంతోపాటు ఇన్ఫినిక్స్ హాట్ 40, ఇన్ఫినిక్స్ హాట్ 40 ప్రో మోడల్ ఫోన్లు కూడా ఉన్నాయి. యూనిసోక్ టీ606 ఎస్వోసీ చిప్ సెట్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది.
18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉంటుందని ధ్రువీకరించింది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంటుంది. దీని ర్యామ్ వర్చువల్గా 8 జీబీ వరకూ పొడిగించుకోవచ్చు.ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ ధర సుమారు రూ.8,300 పలుకుతుందని భావిస్తున్నారు.
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ 60 హెర్ట్జ్-90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే తో వస్తున్నది. పీక్ బ్రైట్ నెస్ 480 నిట్స్ ఉంటుంది. యూనిసోక్ టీ606 ఎస్వోసీ (Unisoc T606 SoC) చిప్ సెట్ కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వరకు ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ డ్యుయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

