Infinix Hot 30 5G | భారత్‌లోకి ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డిటైల్స్..!
Infinix Hot 30 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ హాట్30 5జీ పేరుతో మరో బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. భారీగా 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
Infinix Hot 30 5G | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. శుక్రవారం తన ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ (Infinix Hot 30 5G) భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. చైనా ట్రాన్సియన్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ (Infinix Hot 30 5G) 7ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్ సెట్, 8జీబీ రామ్ కెపాసిటీ కలిగి ఉంటది. 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ ఫ్లస్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 580 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వస్తున్నది. ఇది అత్యధికంగా 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ జత చేశారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈనెల 18 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ (Infinix Hot 30 5G) .. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.12,499లకు, టాప్ ఎండ్ మోడల్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,499లకు లభిస్తుంది. అరోరా బ్లాక్, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తున్నది.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ (Infinix Hot 30 5G) కొనుగోలు చేసే వారికి రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. నెలకు రూ.2,250 చొప్పున నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్-13 బేస్డ్ ఎక్స్ఓఎస్ 13 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ (Infinix Hot 30 5G) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఏ డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంటుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ (Infinix Hot 30 5G) .. 5జీ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూ టూత్, వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, జీ-సెన్సర్, గైరోస్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్ కూడా ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్షన్ కూడా ఉంటుంది. డీటీఎస్ టెక్నాలజీతో డ్యుయల్ స్పీకర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

