RBI CBDC | క్రిప్టో లావాదేవీలకు చెక్.. 2023 ప్రారంభంలో సీబీడీసీ..!
RBI CBDC | బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఆర్బీఐ రూపొందిస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) 2023 మొదట్లో రానుంది.
RBI CBDC | క్రిప్టో కరెన్సీల స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేందుకు ఆర్బీఐ అధికారిక డిజిటల్ కరెన్సీ వచ్చే ఏడాది (2023) ప్రారంభంలో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. అందుకు అవసరమైతే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వాలెట్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రైవేట్ సంస్థ ద్వారా విడుదల చేసే డిజిటల్ కరెన్సీకి సావరిన్ ఫెసిలిటీ ( sovereign-backed facility ) కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రతి డిజిటల్ రూపీకి యూనిక్ నంబర్
గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి తన 2022-24 బడ్జెట్ స్పీచ్‌లో త్వరలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ రూపీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ యూనిట్లలో విడుదల చేయనున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి కరెన్సీకి ఒక యూనిక్ (unique ) నంబర్ ఉంటుంది. అంతేకాదు.. ఆర్బీఐ విడుదల చేసే డిజిటల్ రూపీని కరెన్సీ సర్క్యులేషన్లో కలుపుతారు. ప్రతి ఫియట్ కరెన్సీ ఎలక్ట్రానిక్ ఫామ్.. ప్రభుత్వ అధీకృత ఎలక్ట్రానిక్ వాలెట్ ( government-mandated electronic wallet )గా పరిగణిస్తారని ఆ వర్గాల కథనం.
సీబీడీసీతో అన్ని ట్రాన్సాక్షన్స్ ఇలా ట్రేస్
బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఆర్బీఐ అభివృద్ధి చేస్తున్న డిజిటల్ రూపీతో అన్ని రకాల లావాదేవీలను ట్రేస్ చేయొచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తున్న మొబైల్ వాలెట్లతో డిజిటల్ కరెన్సీల లావాదేవీలను కనిపెట్టడం కష్ట సాధ్యంగా పరిణమించింది. ప్రైవేట్ కంపెనీలు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్ వాలెట్‌ను ఉపయోగించి సంబంధిత వ్యక్తులు తాము లావాదేవీలు జరిపిన మర్చంట్స్‌కు మనీ పే చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం చివరికల్లా డిజిటల్ రూపీ అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ సంకేతాలిచ్చింది.
ఆర్బీఐ డిజిటల్ రూపీతో ఇలా ఈజీ
మీ వద్ద నోటుకు బదులు ఆర్బీఐ జారీ చేసిన డిజిటల్ కరెన్సీ మీ ఫోన్లో కలిగి ఉంటే దాన్ని ఏదేనీ మర్చంట్‌కు బదిలీ చేయొచ్చు. ప్రైవేట్ కంపెనీల ఈ-వాలెట్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే క్రెడిట్ రిస్క్ కూడా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

