Adani | మళ్లీ అదానీయే టాప్.. ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్‌బర్గ్ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద.. తిరిగి పుంజుకున్నది.
- 97.6 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు
- ఆసియాలోనూ అగ్రస్థానం
- రెండో స్థానంలోకి ముకేశ్ అంబానీ
- బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా జాబితా
Adani | న్యూఢిల్లీ, జనవరి 5: అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్‌బర్గ్ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద.. తిరిగి పుంజుకున్నది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లూ భారతీయ శ్రీమంతుడిగా కొనసాగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి మరోసారి అదానీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా జాబితా ప్రకారం అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ముకేశ్ అంబానీ 97 బిలియన్ డాలర్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో భారత్‌లోనేగాక, ఆసియా దేశాల్లోనూ అపర కుబేరుడు గౌతమ్ అదానీయేనని తేలింది.
ప్రపంచ కుబేరుల్లో..
ప్రపంచ శ్రీమంతుల ర్యాంకుల్లో అదానీ 12వ స్థానంలో ఉన్నారు. ముకేశ్ 13వ స్థానంలో ఉన్నట్టు బ్లూంబర్గ్ తెలిపింది. గత నెల విడుదల చేసిన జాబితాలో అంబానీ 14వ స్థానంలో ఉంటే, అదానీ 15వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. హిండెన్‌బర్గ్ కేసులో సెబీ దర్యాప్తును సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో అదానీ సంపద ఒక్కరోజులోనే 7.7 బిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. ఇదే ముకేశ్‌ను దాటి అదానీని నెంబర్ 1ను చేసింది. ఇక ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా గౌతమ్ అదానీ సంపద 13.3 బిలియన్ డాలర్లు ఎగబాకింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్లను కొనేందుకు మదుపరులు పోటీపడ్డారు. హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు భారతీయ అపర కుబేరుడిగా అదానీ వెలుగొందిన సంగతి విదితమే. ఇక ఒకానొక దశలోనైతే అదానీ సంపద 150 బిలియన్ డాలర్లను తాకింది. ఈ సమయంలోనే టాప్-3 ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా అదానీ రికార్డు సృష్టించారు. అయితే హిండెన్‌బర్గ్ చేసిన అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఏకంగా 85 శాతం మార్కెట్ విలువను అదానీ గ్రూప్ కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా అదానీ వ్యక్తిగత సంపద సైతం దారుణంగా పడిపోయింది.
ఇతరుల్లో..
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా ముకేశ్ అంబానీ సంపద 665 మిలియన్ డాలర్లు ఎగిసింది. అలాగే తాజా జాబితా టాప్-50లో ఉన్న భారతీయుల విషయానికొస్తే.. 34.6 బిలియన్ డాలర్ల సంపదతో షాపూర్ మిస్త్రీ 38వ స్థానంలో, 33 బిలియన్ డాలర్లతో శివ్ నాడార్ 44వ స్థానంలో ఉన్నారు. కాగా, అదానీ గ్రూప్ సంస్థల్లో అత్యంత ప్రధానమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రెవెన్యూ గత ఆర్థిక సంవత్సరం (2022-23) 17 బిలియన్ డాలర్లు పెరిగినట్టు బ్లూంబర్గ్ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్‌నకు చెందిన 9 సంస్థలు ట్రేడ్ అవుతున్నది తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

